Krithi Shetty: కొంటె చూపులతో గిలిగింతలు పెడుతున్న బేబమ్మ.. గ్లామర్ షో మొదలెట్టేసిందిగా..?
తెలుగు చలనచిత్ర పరిశ్రమ లోకి ఉప్పెన సినిమాతో తొలిసారి అడుగుపెట్టి మొదటి సినిమాతోనే రూ .100కోట్ల క్లబ్లో చేరి రికార్డు సృష్టించిన కృతి శెట్టి, తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది..ముఖ్యంగా దర్శక నిర్మాతల కంట్లో పడ్డ ఈ వయ్యారి బంగార్రాజు , శ్యామ్ సింగరాయ్ వంటి చిత్రాలలో కూడా నటించి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే హ్యాట్రిక్ అందుకుంది.
ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ కథల ఎంపిక విషయంలో తడబాటు పడ్డ ఈమె.. ఆ తర్వాత నటించిన చిత్రాలేవీ కూడా సక్సెస్ కాలేకపోయాయి. ఆలా ఈమె నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ది వారియర్ వంటి చిత్రాలన్నీ కూడా డిజాస్టర్ గా నిలిచాయి. ఇటీవల నాగచైతన్య సరసన కస్టడీ సినిమాలో నటించిన ఈమె, అది కూడా విజయం సాధించలేదు. ఆ తర్వాత వచ్చిన శర్వానంద్ మూవీ మనమే మూవీలో కూడా నటించింది. ఈ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది.
దీంతో తెలుగులో అవకాశాలు తగ్గుతున్న క్రమంలో బాలీవుడ్ పై ఫోకస్ చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు అక్కడ వరుణ్ దావన్ హీరోగా నటిస్తున్న ఒక సినిమాలో ఈమెకు హీరోయిన్ గా అవకాశం లభించిందని సమాచారం.
అందుకోసమే సోషల్ మీడియాలో మరింత ఎక్కువ యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ ఫోటోషూట్లను షేర్ చేస్తోంది. ఇటీవలే ముంబై వీధిలో కనిపించడంతో ఇక ఈమె అక్కడ బాలీవుడ్ సినిమాలో నటిస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే తాజాగా బాలీవుడ్ లో అటెన్షన్ క్రియేట్ చేయడానికి వరుస గ్లామర్ ఫోటోషూట్ షేర్ చేస్తోంది.
అందులో భాగంగానే తాజాగా చీర కట్టులో ఫోటోలు షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. వీపు అందాలతో గిలిగింతలు పెట్టేసింది. పై అందాలతో చెమటలు పట్టించింది ఈ ముద్దుగుమ్మ. కొంటె చూపుతో కునుకు లేకుండా చేస్తున్న ఈమె చీరకట్టులో కూడా అందాలు ఆరబోయవచ్చు అంటూ ఫోటోలు షేర్ చేసింది కృతి శెట్టి. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా బాలీవుడ్లో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వెళుతున్న ఈమె అక్కడ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.