HBD KT Rama Rao: పిక్ ఆఫ్ ది డే కేసీఆర్, కేటీఆర్ ఆలింగనం.. ఘనంగా కేటీఆర్ బర్త్‌డే వేడుకలు

KTR Birthday: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. హైదరాబాద్‌లోని నందినగర్ ఉన్న నివాసంలో కేటీఆర్ తన తండ్రి, మాజీ సీఎం కేసీఆర్, తల్లి శోభల పాదాలకు నమస్కరించారు. కుమారుడిని దీవించిన కేసీఆర్, శోభ మిఠాయి తినిపించారు. అక్షింతలు వేసి కేసీఆర్ దంపతులు దీవించారు.

KTR Birthday: అంతకుముందు కేటీఆర్‌ను కేసీఆర్ ఆత్మీయంగా హత్తుకున్నారు. ఈ దృశ్యాలు ఆసక్తికరంగా ఉన్నాయి.

KTR Birthday: కేటీఆర్ పుట్టినరోజు వేడుకల్లో అతడి సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షు, కూతురు అలేఖ్య ఉన్నారు. తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, తల్లి శోభమ్మ గార్లకు పాద నమస్కారాలు చేసి వారి ఆశీర్వాదాలను కేటీఆర్ తీసుకున్నారు.
KTR Birthday: కుమారుడు కేటీఆర్‌ను ప్రేమతో కేసీఆర్ గుండెకు హత్తుకున్నారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని మనసారా కేసీఆర్ దంపతులు ఆశీర్వదించారు.
KTR Birthday: అంతకుముందు రాష్ట్రవ్యాప్తంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు సహాయ కార్యక్రమాలు చేపట్టారు.
KTR Birthday: హైదరాబాద్‌లోని స్టేట్ హోంలో విద్యార్థినుల సమక్షంలో కేటీఆర్ తన జన్మదిన వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా 100 మంది విద్యార్థినులకు లాప్‌టాప్‌లను కేటీఆర్ అందజేశారు.
KTR Birthday: మాజీ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా పోచంపల్లి ఫౌండషన్ అధినేత, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అందించిన కుట్టు మిషన్‌లతో లింగాల ఘణపురం మహిళలు
KTR Birthday: లింగాల ఘణపురం మండలంలోని వెయ్యి మంది మహిళలకు పోచంపల్లి ఫౌండషన్ అధినేత, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కుట్టు మిషన్‌లు పంపిణీ చేశారు.