HYDRAA Terror: హైడ్రా బాధితులకు గులాబీ దళం భరోసా.. కేటీఆర్‌ పర్యటనతో నిండుధైర్యంగా ప్రజలు

Mon, 30 Sep 2024-9:23 pm,

పూర్తి భరోసా: ఏ ఉదయం వచ్చి తమ ఇళ్లు కూల్చివేస్తారేమోనని నిద్రలేని రాత్రులు గడుపుతున్న ప్రజలు.. తమ ఇల్లు ఎప్పుడూ కూలుస్తారేనని.. ఎప్పుడూ తమ ప్రాంతంలోకి బుల్డోజర్లు దూసుకొస్తాయోనని హైరానా పడుతున్న ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ ధైర్యం ఇచ్చింది.

బాధితులకు అండగా: హైడ్రా బుల్డోజర్లతో హైదరాబాద్‌ ప్రజలు బెంబేలెత్తుతున్నారు. భయంభయంతో బతుకుతున్న పేద, మధ్య తరగతి ప్రజలకు బీఆర్‌ఎస్‌ పార్టీ భరోసా లభించింది.

రెండు ప్రాంతాల్లో: రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని హైదర్‌గూడ, కిషన్‌బాగ్‌లలో మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ బాధితులను సోమవారం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ పరామర్శించారు.

గులాబీ దండు: క్షేత్రస్థాయిలో మాజీ మంత్రులు మహమూద్‌ అలీ, సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్‌ రెడ్డి, ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి తదితరులు పర్యటించి హైడ్రా బాధితులకు ధైర్యం ఇచ్చారు.

బాధితులకు భరోసా: రాజేంద్రనగర్ పరిధిలోని మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ బాధితులను కలిసిన మాజీమంత్రులు వారితో మాట్లాడి భరోసా ఇచ్చారు.

బాధితులతో మాటామంతీ: కిషన్ బాగ్ పరిధిలోని మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ బాధితులను కూడా కలిసి వారికి మేమున్నామని అండగా నిలిచారు.

బాధితుల గోడు: బీఆర్‌ఎస్‌ బృందంతో స్థానిక ప్రజలు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా కన్నీటిపర్యంతమయ్యారు.

హైడ్రాపై ఆగ్రహం: హైడ్రా కూల్చివేతలపై ప్లకార్డులు ప్రదర్శిస్తూ బాధితులు నిరసన వ్యక్తం చేశారు.

అనూహ్య స్పందన: బీఆర్‌ఎస్‌ బృందానికి సందర్శనకు స్థానికుల నుంచి భారీగా మద్దతు లభించింది. తమకు అండగా నిలవాలని.. న్యాయం చేయాలని స్థానికులు కోరారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link