KTR Veda Sri: వేద శ్రీని కలిసిన మాజీ మంత్రి కేటీఆర్.. ఇంతకీ ఎవరామె? ఏం సంబంధం?
చిన్నారి మాట్లాడిన వీడియో చూసిన బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం వారి కుటుంబాన్ని కలిశారు.
వేద శ్రీని కలిసి వారి కుటుంబసభ్యులతో కేటీఆర్ మాట్లాడారు. హైడ్రా బారి నుంచి మీకు అండగా ఉంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు.
మీడియాతో మాట్లాడిన చిన్నారి వేదశ్రీతో కేటీఆర్ ప్రత్యేకంగా మాట్లాడారు. పుస్తకాలు తీసుకోలేదని చెప్పడంతో కేటీఆర్ బాలికకు స్కూల్ బ్యాగ్, పుస్తకాలు ఇచ్చారు.
వేదశ్రీతోపాటు చిన్నారికి తోడబుట్టిన వాళ్లకు కూడా కేటీఆర్ బ్యాగ్‌లు, పుస్తకాలు, నీళ్ల సీసా అందించారు.
ఈ సందర్భంగా వేద శ్రీతో 'అంత ధైర్యంగా ఎలా మాట్లాడవ్? ఎవరు నేర్పిచారు' అని కేటీఆర్ ప్రత్యేకంగా మాట్లాడారు.
వేద శ్రీ ఇంటి పత్రాలు కేటీఆర్, బీఆర్‌ఎస్ పార్టీ లీగల్ టీమ్ పరిశీలించింది.
ఇలాంటి పేద పిల్లలు నివసిస్తున్న ఇళ్లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం దుర్మార్గంగా కూల్చివేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు.
హైడ్రా కూల్చివేతల కారణంగా పిల్లలతో సహా తాము రోడ్డున పడ్డామని వేదశ్రీ కుటుంబసభ్యులు కేటీఆర్ ముందు ఆవేదనకు లోనయ్యారు.
వేదశ్రీ కుటుంబానికి కేటీఆర్ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. హైడ్రా బాధితులందరికీ బీఆర్ఎస్ పార్టీ న్యాయ సహాయం అందిస్తుందని తెలిపారు.
ఎవరూ ఆందోళన చెందవద్దని హైడ్రా బాధితులంతా బీఆర్‌ఎస్ పార్టీ నాయకులను సంప్రదించాలని కేటీఆర్ సూచించారు.