Vishal Health: హీరో విశాల్‌కు ఏమైంది..?... అసలు గుట్టు బైటపెట్టిన నటి ఖుష్బూ.. ఏమన్నారంటే..?
కన్నడ హీరో ఇటీవల విశాల్ హెల్త్ గురించి అనేక రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆయన గత ఆదివారం.. చెన్నైలో.. మదగజరాజ ఈవెంట్ కు హజరయ్యారు. అక్కడ ఆయన్ను చూసి అందరు షాక్ అయ్యారు.
విశాల్ వణుకుతూ.. కన్పించారు. దాదాపు.. 11 ఏళ్ల తర్వాత ఆయన హీరోగా చేసిన మదగజరాజ మూవీ ఈవెంట్ కు ఆయన అటెండ్ అయ్యారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడేట్పుడు కూడా వణుకుతు కన్పించారంట.
దీంతో ఆయనకు ఏదో అయ్యిందని.. పెద్ద వ్యాధి సోకిందని కూడా సోషల్ మీడియాలో దారుణంగా రూమర్స్ వ్యాప్తి చేశారు. అంతే కాకుండా.. ఆయన ప్రేమలో ఫెయిల్ కావడం వల్ల ఈ విధంగా మారిపోయారని ప్రచారం జరిగింది.
దీనిపై తాజాగా.. నటి ఖుష్బూ దీనిపై స్పందించారు. హీరో విశాల్ పై వస్తున్న రూమర్స్ ను ఖండించారు. దాదాపు.. 11 ఏళ్ల తర్వాత ఈ మూవీ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో.. హీరో విశాల్ ఇంత కష్టపడ్డ కూడా.. ఇలాంటి రూమర్స్ చేయడమేంటని ఫైర్ అయ్యారు.
విశాల్ కు కేవలం డెంగీ ఫీవర్ సొకిందని.. దాదాపు.. 103 డిగ్రీల ఫీవర్ ఉన్న కూడా.. విశాల్ ఈ మూవీ ఈవెంట్ కు వచ్చారన్నారు. అంతే కాకుండా..విశాల్ ఈ మూవీలో ఎంతో డెడికేషన్ తో వర్క్ చేశారన్నారు. తనంటే నాకు ఎంతో గౌరవమని.. ఇద్దరం కలిసి వర్క్ చేశామన్నారు. ఇలాంటి రూమర్స్ దయచేసి వైరల్ చేయోద్దని నటి ఖుష్బూ కోరినట్లు తెలుస్తొంది.
మరోవైపు మదగజరాజ మూవీకి సి. సుందరం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా.. జనవరి 12 న అభిమానుల ముందుకు రానుందని తెలుస్తొంది. చెన్నైలో జరిగిన ఈవెంట్ కు.. విశాల్, ఖుష్బూ, సంగీత, దర్శకుడు విజయ్ ఆంటోనీ తదితరులు పాల్గొన్నట్లు సమాచారం.