Lady Aghori: వాళ్ల అంతం చూస్తా..?.. శివతాండం చేసిన అఘోరీ మాత.. అసలేం జరిగిందంటే..?..
తెలంగాణలో సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలోని విగ్రహాంను ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాలితో తన్నిన విషయం తెలిసిందే. దీనిపై హిందు సంఘాలన్ని భగ్గుమన్నాయి.
అంతే కాకుండా.. సికింద్రాబాద్ లో బంద్ కార్యక్రమం చేపట్టారు. అదికాస్త రణరంగంగా కూడా మారింది. హిందు సంఘాలన్ని ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం వద్దకు చేరుకుని తమ నిరసన తెలిపాయి.
ఈ నేపథ్యంలో ఒక అఘోరీ మాత అక్కడికి వచ్చి ముత్యాలమ్మ ఆలయంలో ప్రత్యేకంగా పూజలు చేశారు. అప్పటి నుంచి అఘోరీమాత తెలంగాణ ఒక సెన్సెషన్ గా మారారు. ఇలాంటి ఘటనకు పాల్పడిన వాడిని వదలొద్దన్నారు.
అంతే కాకుండా.. మన ధర్మంను కాపాడుకుంటునే.. ఇతర ధర్మలను గౌరవించాలన్నారు. అదే విధంగా సనాతన ధర్మంను కాపాడుకొవాలన్నారు. ఈ క్రమంలో అఘోరీ మాత తాను.. అఘోరీలాగా మారడం వెనుక ఉన్న రహాస్యాలు చెప్పారు. ఏడేళ్ల ప్రాయంలో కాశీకి వెళ్లి అక్కడ గురువు దగ్గర విద్యులు కఠినంగా ఉపాసనలుచేసి, ఎన్నోఏళ్లు కష్టపడి అఘోరీగా మారానని చెప్పారు.
పంచభూతాలు తమ ఆధీనంలో ఉంటాయని, నిత్యం శవాలను భుజిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు వెయ్యికి పైగా శవాలని తిన్నానని, 20 ఏళ్ల క్రితమే తనకు తానుగా పిండ ప్రదానం చేసుకున్నట్లు కూడా చెప్పారు. ఇతర మహిళల్లా పీరియడ్స్ వస్తాయని కూడా చెప్పారు. ఇటీవల లేడీ అఘోరీ.. వేముల వాడ రాజన్న, కొముర వెల్లీమల్లన్న , కీసర గుట్ట ఆలయాల్ని సైతం దర్శించుకుని పూజలు చేశారు.
ఇదిలా ఉండగా.. అఘోరీ మాత స్మార్ట్ ఫోన్ లను ఉపయోగించడం, కారును నడిపించడం వెనుక కారణాలు కూడా చెప్పారు. తనకు కారును ఒక భక్తుడు కానుకగా ఇచ్చినట్లు చెప్పారు. కేవలం ఒకరిమంచి కోసమే తాము పూజలు చేస్తామన్నారు.
ఇదిలా ఉండగా.. కొంత మంది మాత్రం.. ఆమె అఘోరీ కాదని, డబ్బుల కోసం ఇలా నటిస్తుందని ట్రోల్స్ చేశారు. మరికొందరు ఒక అడుగు ముందుకేసి ఆమెను అరెస్టు సైతం చేశారని కూడా కొన్ని కథనాలు ప్రచురించినట్లు తెలుస్తొంది. దీనిపై లేడీ అఘోరీ ఫైర్ అయ్యారు.
తనను ట్రోల్స్ చేసిన వాళ్ళ అంతం చూస్తానని,లేడీ అఘోరీ హైవే మీద తాండవం చేశారు. మళ్లీ ఈ నెల చివర్లో తెలంగాణలో వస్తానని అప్పుడు అందరి బండారాలు బైటపెడతానంటూ ఆవేశంతో ఊగిపోయారు. దీంతో అఘోరీ మాత మళ్లీ ట్రెండింగ్ గా మారారు.