Lakshmi Yogam In Telugu: ఏప్రిల్ 9న ఈ రాశుల వారిపై కుబేరుడి వరాల జల్లు.. విపరీతమైన లాభాలే లాభాలు..

Wed, 27 Mar 2024-11:37 am,

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏదైనా ఒక రాశిలో మూడు గ్రహాలు కలయిక జరిగితే, ప్రత్యేక యోగాలు ఏర్పడతాయి. ఈ మూడు గ్రహాల కలయిక కారణంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన త్రిగ్రహి, నారాయణ యోగాలు ఏర్పడబోతున్నాయి. 

త్రిగ్రహి లక్ష్మీనారాయణ యోగాల కారణంగా ఏప్రిల్ 9వ తేదీ నుంచి కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. దీంతో పాటు కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ఈ రెండు యోగాల కారణంగా ఎక్కువ లాభాలు పొందబోయే రాశుల వారెవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

లక్ష్మీనారాయణ యోగం కారణంగా మకర రాశి వారికి ఊహించని లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా వీరికి కుటుంబ సభ్యుల మద్దతు లభించడమే కాకుండా ఆర్థికంగా విపరీతమైన లాభాలు పొందుతారు. విదేశాల్లో చదవాలనుకునే వారి కోరిక సులభంగా నెరవేరబోతోంది.  

ముఖ్యంగా ప్రభుత్వ రంగాల్లో పనులు చేస్తున్న వారికి ఈ సమయంలో ఊహించని లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా అధికారుల మద్దతుతో జీతాలు పెరగడమే కాకుండా పదోన్నతులు లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఈ సమయంలో ఉద్యోగాలు చేస్తున్నవారు ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.  

కర్కాటక రాశి వారికి కూడా ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి అనేక ఆర్థిక లాభాలు కలగడమే కాకుండా అదృష్టం రెట్టింపు అవుతుంది. దీంతోపాటు విపరీతమైన ధన లాభాలు కూడా కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఉద్యోగాలు చేసే వారికి ఈ సమయం చాలా శుభ్రంగా ఉండబోతోంది.

కర్కాటక రాశి వారు ఈ ప్రత్యేక యోగ ప్రభావం కారణంగా విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీంతో పాటు పిల్లలకు తల్లిదండ్రుల మద్దతు లభించి అద్భుతమైన లాభాలు పొందుతారు. అలాగే వ్యాపారాలు చేస్తున్న వారికి కూడా ఈ లక్ష్మీ నారాయణ యోగం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. 

మేష రాశి వారికి కూడా ఈ సమయంలో అనుకున్న లాభాలను కలుగుతాయి. ముఖ్యంగా వీరికి షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన డబ్బులు రెట్టింపు అవుతాయి. అలాగే కుటుంబ సభ్యులతో మీరు ఎంతో ఆనందంగా గడుపుతారు. అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ఈ సమయంలో సులభంగా ఉపశమనం లభిస్తుంది.

ఇక వ్యాపారాలు చేస్తున్న వారి విషయానికొస్తే.. విదేశీ పెట్టుబడుల కారణంగా కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. దీంతో సంపాదన రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా ఇంతకుముందు వ్యాపారాల్లో పోగొట్టుకున్న డబ్బులు కూడా సులభంగా తిరిగి వస్తాయి. అలాగే విదేశాల్లో చదువుకోవాలనుకుంటున్న వారి కోరిక నెరవేరబోతోంది.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link