8Th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు రూ.34 వేల జీతం పెంపు పై క్లారిటీ.. పూర్తి వివరాలు..

Wed, 18 Sep 2024-2:22 pm,

8 పే కమిషన్ (8th pay commission) కంటే ముందుగా వచ్చని 6th, 7th కమిషన్‌లో ద్రవ్యోల్బణం, ఆర్ధిక వ్యవస్థలోని ఇతర మార్పుల గురించి పూర్తిగా వివరించారు. వీటిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల జీతాలలో మార్పులను తీసుకువచ్చేందుకు 8పే వేతన సంఘం అమలుకు చర్చలను జరిపినట్లు తెలుస్తోంది.   

ఇక ఎడవ వేతన సంఘం వివరాల్లోకి వెళితే.. కేంద్ర ప్రభుత్వం ఇందులో  కొన్ని అంశాలపై ప్రస్తావించింది.   ఇది ఫిబ్రవరి 28న 2014 ఏర్పాటైంది. కానీ దీనిని కేంద్రం 2016 జనవరి 1న అమల్లోకి తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే...   

ఇక 7th pay commission ప్రకారం ఒక్కొక్క ఉద్యోగికి రూ.18,000 ఉండేటట్లు కేంద్రం కీలక నిర్జయం తీసుకుంది. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57 చేయగా... దీంతో ఒక్కొక్క ఉద్యోగికి దాదాపు రూ. 11,000 పైగా జీతం పెరిగిందని చెప్పవచ్చు.   

2006 జులైలో కేంద్ర ప్రభుత్వం  ఆరవ వేతన సంఘం ప్రారంభించింది.  దీని ప్రకారం ఒక సగటు ఉద్యోగి జీతం రూ. 7,000 కొనసాగించాలని  ఆగస్టు  2008లో రెండో వారంలో ఈ పే కమీషన్‌ను ఆమోదించింది.   

6th pay commission ప్రకారం ఫిట్మెంట్ను 1.74 సిఫారసు చేయగా పోను పోను  1.86కి పెంచుతూ వచ్చారు. దీని ప్రకారం 2008  సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి అన్ని అలవెన్సులు పొందారు..  అలాగే (DA) కూడా 16 నుంచి 22 శాతానికి పెరిగినట్లు  తెలుస్తోంది.   

ఎనిమిదవ వేతన సంఘంను కేంద్ర ప్రభుత్వం  2026లో అమలుకోకి  తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ వేతన సంఘం గురించి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయలేదు. కానీ ఎనిమిదవ వేతన సంఘం అమల్లోకి వస్తే మాత్రం భారీగా జీతాలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.   

8th pay commissionను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువస్తే ఒక్కొక్క ఉద్యోగికి మూలవేతనం దాదాపు 20 నుంచి 35 %  పెరగొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఒక్కసారిగా రూ.34,560 పెరిగే అవకాశాలున్నాయి. అలాగే వివిధ అలవెన్స్ లను కూడా పెంచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link