Laughing Health Benefits: ప్రతి నవ్వుకు.. మీ ఆయుష్షు రెట్టింపు.. నవ్వండి.. నవ్వించండి ఆరోగ్యంగా ఉండండి..
వైద్య నిపుణులు ప్రతిరోజు 10 నిమిషాల పాటు నవ్వడాన్ని ఒక రకమైన యోగాగా కూడా భావిస్తారట. ముఖ్యంగా ప్రతిరోజు నవ్వడం వల్ల అనేక రకాల మానసిక సమస్యలు కూడా దూరం అవుతాయని వారంటున్నారు. ఆందోళన, ఇతర జబ్బులతో బాధపడుతున్న వారు ప్రతిరోజు 10 నుంచి 15 నిమిషాల పాటు నవ్వడం ఎంతో మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రతిరోజు ఒక పది నిమిషాలు అయినా నవ్వడం వల్ల మానసిక ప్రశాంతత మెరుగుపడుతుంది. దీంతో పాటు మెదడులో ఎండార్పిన్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి బ్రెయిన్ సర్జరీలు కాకుండా కూడా ఉంటాయట. అంతేకాకుండా నాడీ వ్యవస్థ మెరుగుపడి మెదడు చురుకుగా కూడా తయారవుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
నవ్వును మన పూర్వీకులు సంతోషానికి గుర్తుగా భావించేవారట. నవ్వుతూనే జీవితాలు చాలా బాగుండేవని వారు చెబుతూ ఉండేవారు. కోపం, చిరాకు వంటి సమస్యలను తొలగించేందుకు నవ్వు కీలక పాత్ర కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా డిప్రెషన్ను తొలగించి వివిధ రకాల అనారోగ్య సమస్యలు రాకుండా కూడా చేస్తుంది.
కొంతమంది అయితే ఇతరులు జోక్స్ వేసినప్పుడు నవ్వు వచ్చిన నవ్వకుండా ఉంటారు. నిజానికి ఇది పెద్ద రోగంగా వైద్య నిపుణులు భావిస్తున్నారు. ప్రతిరోజు కేవలం 10 నుంచి 20 నిమిషాల పాటు నవ్వడం వల్ల ఎన్నో రకాల దీర్ఘకాలిక వ్యాధులు సులభంగా దూరమవుతాయట. ముఖ్యంగా షుగర్, బీపీ కూడా కంట్రోల్ అవుతుందని ఇటీవల అధ్యయనాల్లో తేలింది.
నవ్వు ముఖ సౌందర్యాన్ని పెంచేందుకు కూడా ఎంతో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కనీసం 10 నిమిషాలైనా నవ్వడం వల్ల ఎన్నో రకాల వ్యాధులకు దూరంగా ఉండవచ్చని వారంటున్నారు. అలాగే నవ్వుతూ మాట్లాడడం వల్ల సమాజ సంబంధాలు కూడా మెరుగుపడతాయి. కాబట్టి నవ్వుతూ ఆరోగ్యంగా జీవించుదాం..