Lava Blaze Duo 5G First Sale: డ్యూయల్ డిస్ల్పే Lava Blaze Duo 5G మొబైల్ కేవలం రూ.12 వేలకే.. ఫీచర్స్ చూస్తే ఆగమవుతారు!
ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో ఈ Lava Blaze Duo 5G స్మార్ట్‌ఫోన్ విక్రయాలు శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. అయితే ఈ మొదటి సేల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. దీనినికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
ఇక ఈ Lava Blaze Duo 5G స్మార్ట్‌ఫోన్ ధర పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇది రెండు వేరియంట్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం మార్కెట్‌లో ఇది 6GB ర్యామ్‌తో పాటు 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో అందుబాటులో ఉంది. ఇందులోని మొదటి వేరియంట్ ధర రూ.16,999 నుంచి లభిస్తోంది.
ఈ స్మార్ట్‌ఫోన్ రెండవ వేరియంట్ వివరాల్లోకి వెళితే.. 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌లో విడుదలైంది. దీని ధర రూ.17,99తో లభిస్తోంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ రెండు కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది.
ఇక అమెజాన్‌తో ఈ మొబైల్‌ను మొదటి సేల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి దాదాపు రూ.2000 బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. దీనిని కొనుగోలు చేసే క్రమంలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డ్ సహాయంతో బిల్ చెల్లిస్తే దాదాపు రూ.2 వేల వరకు తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది.
ఇక Lava Blaze Duo 5G స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్ల వివరాల్లోకి వెళితే.. దీనిని కంపెనీ MediaTek Dimensity 7025 SoC ప్రాసెసర్‌తో అందుబాటులోకి తీసుకు వచ్చింది. అంతేకాకుండా ఆండ్రాయిడ్ 14 అప్‌డేట్ వేరియంట్‌తో విడుదల చేసింది.
ఈ స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల డిస్ల్పేతో లభిస్తోంది. ఇది FHD+ 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే సపోర్ట్ ఫీచర్‌తో అందుబాటులో ఉంది. దీని సెకండ్ డిస్ల్పే బైక్ సైడ్‌లో 1.58 అంగుళాలతో వస్తోంది. అంతేకాకుండా 64MP ప్రైమరీ సోనీ సెన్సార్ ప్రధాన కెమెరాతో విడుదలైంది.