LB Nagar RHS flyover Photos: గుడ్ న్యూస్.. సిటీలో అందుబాటులోకి ఎల్బీ నగర్ ఆర్‌హెచ్ఎస్ ఫ్లైఓవర్
![LB Nagar RHS flyover Photos: గుడ్ న్యూస్.. సిటీలో అందుబాటులోకి ఎల్బీ నగర్ ఆర్‌హెచ్ఎస్ ఫ్లైఓవర్ LB Nagar RHS flyover photos, LB Nagar RHS flyover to be inaugurated by minister KT Rama Rao tomorrow](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/LB-Nagar-RHS-flyover-to-be-inaugurated-by-minister-KTR-tomorrow-evening-LB-Nagar-RHS-flyover-aerial-view-photos-videos_0.jpg)
LB Nagar RHS flyover Photos: ఎల్బీ నగర్ ఆర్‌హెచ్ఎస్ ఫ్లైఓవర్ వద్ద మరో దృశ్యం కూడా ఆవిష్కృతం కానుంది. నాగోల్ వైపు నుంచి సాగర్ రింగ్ రోడ్డు వైపు వెళ్లే వారి కోసం ఇప్పటికే అక్కడ అండర్ పాస్ నిర్మితమై ఉండగా.. విజయవాడ వైపు నుంచి నగరంలోకి వచ్చే వారి కోసం ఉన్న పాత రహదారికి తోడు తాజాగా ఫ్లైఓవర్ కూడా అందుబాటులోకి వచ్చింది. అంటే ఎల్బీ నగర్ ట్రాఫిక్ సిగ్నల్ మూడు రహదారులకు వేదిక కానుందన్నమాట.
![LB Nagar RHS flyover Photos: గుడ్ న్యూస్.. సిటీలో అందుబాటులోకి ఎల్బీ నగర్ ఆర్‌హెచ్ఎస్ ఫ్లైఓవర్ LB Nagar RHS flyover aerial view photos, LB Nagar RHS flyover to be inaugurated by minister KT Rama Rao tomorrow](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/LB-Nagar-RHS-flyover-to-be-inaugurated-by-minister-KT-Rama-Rao-tomorrow-evening-LB-Nagar-RHS-flyover-aerial-view-pics.jpg)
LB Nagar RHS flyover Photos: 760 మీటర్లు పొడవు, 12 మీటర్ల వెడల్పు ( 3 లేన్)తో నిర్మితమైన ఎల్బీ నగర్ ఆర్‌హెచ్ఎస్ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో హయత్ నగర్, విజయవాడ వైపు నుంచి దిల్‌షుక్ నగర్ గుండా నగరంలోకి ప్రవేశించే వాహనదారులకు ఇక ఎల్బీ నగర్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేకుండాపోయింది.
![LB Nagar RHS flyover Photos: గుడ్ న్యూస్.. సిటీలో అందుబాటులోకి ఎల్బీ నగర్ ఆర్‌హెచ్ఎస్ ఫ్లైఓవర్ LB Nagar RHS flyover aerial view photos, LB Nagar RHS flyover to be inaugurated by minister KT Rama Rao tomorrow](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/LB-Nagar-RHS-flyover-to-be-inaugurated-by-minister-KT-Rama-Rao-tomorrow-evening-LB-Nagar-RHS-flyover-aerial-view-photos-videos.jpg)
LB Nagar RHS flyover Photos: మంత్రి కల్వకుంట్ల తారకరామారావు రేపు శనివారం సాయంత్రం ఎల్బీ నగర్ ఆర్‌హెచ్ఎస్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించనున్నారు.
LB Nagar RHS flyover Photos: స్ట్రాటెజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్ (SRDP) కింద గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) నిర్మించిన ఈ ఫ్లైఓవర్ కోసం ప్రభుత్వం రూ. 32 కోట్ల వ్యయం వెచ్చించింది.
LB Nagar RHS flyover Photos: ఎల్బీ నగర్ ఆర్‌హెచ్ఎస్ ఫ్లైఓవర్ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ట్విటర్ ద్వారా ఆ వంతెన ఫోటోలను షేర్ చేస్తూ ఫ్లైఓవర్ ప్రత్యేకతలను క్లుప్తంగా వెల్లడించారు.