Smelly Shoes: మీ బూట్ల నుంచి భరించలేని దుర్వాసన వస్తుందా..?.. ఈ సింపుల్ టిప్స్ తో చెక్ పెట్టేయోచ్చు..
ప్రస్తుతం చాలా మంది యువతీ, యువకులు షూస్ ను తప్పనిసరిగా ఉపయోగిస్తుంటారు. చెప్పుల ఉపయోగం చాలా వరకు తగ్గిపోయి ,బూట్ల వాడకం పెరిగింది. కానీ కొన్నిసార్లు బూట్ల నుంచి భరించలేని దుర్వాసన వస్తుంది.
కొందరి శరీరంలో నుంచి ఎక్కువగా చెమట వస్తుంటుంది. దీంతో స్మెల్ ఎక్కువగా వస్తుంది. అందుకే సాక్స్ ను తడిగా కాకుండా చూసుకొవాలి. తడిగా ఉన్న సాక్స్ ల నుంచి భరించలేని దుర్వాసన వస్తుంది.
బూట్లను ఉపయోగించిన తర్వాత గాలి ఆడేటట్లు బైట పెట్టాలి. సాక్స్ ను ఎప్పటికప్పుడు ఉతికేసి ఆరేయాలి. కానీ కొందరు వారాం వారం, ఒకే జత సాక్స్ లను ధరిస్తారు. దీంతో బూట్లనుంచి భరించలేని దుర్వాసన వస్తుంది.
ముఖ్యంగా బైటకు రాగానే సాక్స్ తీసి పక్కన పెట్టాలి. షూస్ లేస్ ను కూడా ఉతికి ఎప్పటికప్పులు క్లీన్ గా ఉంచుకొవాలి. వారానికి ఒకసారి షూస్ ను కూడా క్లీన్ గా కడిగేసుకొవాలి. ఇలా చేస్తే బ్యాక్టిరియాలు, వైరస్ లు ఉండవు.
నిమ్మకాయ తొక్కను బూట్లలో వేస్తే చెడు వాసన రాదు. అందుకే రాత్రిపూట నిమ్మకాయ తొక్కను బూట్లలో వేసి పొద్దున తర్వాత తీసేయాలి. ఇలా చేస్తుంటే బూట్ల నుంచి దుర్వాసన అనేది అస్సలు ఉండదు.
తడిగా ఉన్న బూట్లలో బేకింగ్ సోడా వేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇది బూట్లలోని తేమను గ్రహించుకుంటుంది. అందుకే షూస్ వాసన వచ్చినప్పుడు బేకింగ్ సోడా వేస్తుండాలి. కొన్నిరకాల పౌడర్ లు వేసిన కూడా దుర్వాసన రాదు
కొందరు బూట్లను కాగితంలో చుట్టి ఫ్రిజ్ లో పెడుతుంటారు. కాగితం బూట్లలోని తేమను పూర్తిగా గ్రహించుకుంటుంది. మెయిన్ గా సాక్స్ ను తడిగా అవ్వకుండా జాగ్రత్తలు తీసుకొవాలి.