Mango: సమ్మర్ లో మామిడి పండ్లను అతిగా తింటున్నారా..?... ఈ విషయాలు మీకోసమే..
మామిడి పండ్లను చిన్న, పెద్ద తేడాలేకుండా ప్రతి ఒక్కరు తింటుంటారు. ఒకప్పుడు ఏ సీజన్ లో లభించే పండ్లను ఆ సమయంలో తినాలని పెద్దలు చెబుతుండేవారు. కానీ ఇప్పుడు సీజన్ తో సంబంధం లేకుండా అన్నిరకాల పండ్లు అన్ని కాలాల్లో లభిస్తుంటాయి.
పండ్లను అమ్మేవారు.. ఆర్టిఫిషియల్ రసాయలను ఉపయోగించి, పండ్లు ఎక్కువ కాలం నిల్వ ఉండేలా చేస్తున్నారు. అంతే కాకుండా.. ఫ్రూట్స్ లను వెంటనే పండేలా, మంచి రంగులను వచ్చేలా రసాయనాలలో ముంచి ఉంచుతున్నారు.
సమ్మర్ రాగానే మామిడిపండ్లు వస్తుంటాయి. మామిడి పండ్లు తింటే కొందరికి వెంటనే శరీరంపై చెడు ప్రభావం కన్పిస్తుంది. చర్మంపై దద్దుర్లు ఏర్పడతాయి. మామిడి కాయ నుంచి ఒకరకమైన రసం వస్తుంది. ఇది ముఖానికి తాకితే పుండ్లు ఏర్పడతాయి.
కొందరిలో పొట్టలోపల కూడా పుండ్ల మాదిరిగా అవుతాయి.నోటిలో వేడి పుండ్లు, గొంతునొప్పి వంటివి ఏర్పడతాయి. చక్కెర ఉన్న వారు ఇది తక్కువగా తినాలి.. అలర్జీలతో బాధపడే వారు.. మామిడిని తక్కువగా తినాలని నిపుణులు చెబుతుంటారు. మామిడి తినగానే కొందరిలో పొట్ట ఉబ్బి బైటకు వస్తుంది. ఆయాసం కల్గుతుంది.
మామిడిని ముక్కులగా చేసుకుని కొందరు పప్పులలో వేసుకుంటారు. మరికొందరు ఎండలో దాని రసంతీసి ప్లేట్ లో వేస్తుంటారు . ఆరిపోయాక.. దాన్ని తింటారు. చిన్నపిల్లలు దీన్ని ఎక్కువగా ఇష్టంతో తింటారు.
మామిడి కాయ ఆవకాయ వేసిన కూడా దానిలో కారం సరిపోయేంత వరకు మాత్రమే వేయాలి. అంతే తప్ప మామిడిని ఎక్కువగా తినకూడాదు. అతిగా మామిడిని తింటుంటే.. మోషన్స్ కూడా కల్గే ప్రమాదం ఉంటుందని చెబుతుంటారు. Disclaimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్నవి వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)