Lip Shape: పెదవుల ఆకారాన్ని బట్టి వ్యక్తిత్వాన్ని చెప్పొచ్చట... ఏ ఆకారంలో ఉంటే ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉంటారంటే..

Wed, 31 Aug 2022-4:13 pm,

Defined Cupid's Bow: ఇలాంటి పెదవులు కలిగినవారు మంచి వాక్చాతుర్యం కలిగి ఉంటారు. వారి మాటలతో ఎదుటివారిని ప్రభావితం చేయగలరు. ఎక్కడైనా తమను తాము నిరూపించుకోగలిగే సత్తా కలిగి ఉంటారు. చాలా రొమాంటిక్‌గా కూడా ఉంటారు.

Thin Lips : పైన ఫోటోలో కనిపిస్తున్నట్లుగా సన్నని పెదాలు కలిగి ఉన్నట్లయితే.. ఆ వ్యక్తులు అంతర్ముఖులు. అంటే.. అంత సులువుగా ఓపెన్‌అప్ అవరు. ఎక్కువగా ఒంటరిగా గడిపేందుకే ఇష్టపడుతారు. ఇలాంటి వ్యక్తులు ఇతరులతో కలిసిపోవడం కష్టం. వారితో ఇతరులకు కూడా అసౌకర్యంగానే ఉంటుంది.

Full Lips: పెదాలు రెండు నిండుగా ఉన్నట్లయితే.. ఆ వ్యక్తులు మంచి మనసు కలిగి ఉంటారు. ఇతరుల పట్ల ఎప్పుడూ సానుభూతితో ఉంటారు. ఉదార భావాన్ని కలిగి ఉంటారు. కుటుంబం, స్నేహితులకు ప్రాధాన్యతనిస్తారు. అయితే కొన్నిసార్లు తెంపరిగా వ్యవహరిస్తారు. ఆలోచించకుండా మాట్లాడటం వల్ల చిక్కుల్లో పడుతారు.

Full Lower Lip: పైన  ఫోటోలో కనిపిస్తున్నట్లుగా కింది పెదవి నిండుగా ఉన్నట్లయితే.. ఆ వ్యక్తులు చాలా ఎనర్జిటిక్‌గా, ఉల్లాసంగా ఉంటారు. జీవితంలో ఎలాంటి సందర్భంలోనైనా కూల్‌గా ఉంటారు. వృత్తిలో బాగా రాణిస్తారు. కొత్త విషయాలు తెలుసుకోవాలనే కుతూహలం, కొత్త ప్రదేశాలు చూడాలనే ఆసక్తి వీరిలో ఎప్పుడూ ఉంటుంది.

Full Upper Lip: పైన ఫోటోలో కనిపిస్తున్నట్లుగా పై పెదవి నిండుగా ఉన్నట్లయితే... ఆ వ్యక్తులు ఎవరినైనా ఇట్టే ఆకర్షించగలరు. అందరూ ఆ వ్యక్తిని ఇష్టపడుతారు. అలాంటి వ్యక్తులు మంచి హాస్యాన్ని పండిస్తారు. ఎవరినైనా, ఎప్పుడైనా ఇట్టే నవ్వించగలరు. ఎక్కడున్నా సరే కాస్త స్పెషల్‌గా ఉంటారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link