Liquor Prices: మద్యం రేట్లకు రెక్కలు..! స్ట్రాంగ్ బీర్ రూ. 250..

Thu, 09 Jan 2025-4:02 pm,

Liquor Prices:తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా కొలువుదీరి యేడాది కావొస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ముఖ్యంగా మద్యం రేట్లు యథాతదంగా కొనసాగుతున్నాయి. తాజాగా తెలంగాణలో బీర్ సీసాల అమ్మకం ఉండవని వాటిని ప్రొడ్యూస్ చేసే సంస్థ ప్రకటించిన నేపథ్యంలో మందుబాబులు ఆందోళన చెందుతున్నారు.

తెలంగాణ తమ బ్రాండ్ల బీర్ల సరఫరాను నిలిపివేస్తున్నట్టు కింగ్ ఫిషర్ కు చెందిన  యునైటైడ్ బ్రేవరేజ్ సంస్థ ప్రభుత్వానికి తెలియజేసింది. గత కొన్నేళ్లుగా ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన బకాయిలతో పాటు ధరలు పెంపు పై ఎలాంటి నిర్ణయం ప్రభుత్వం ప్రకటించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

ఒకవేళ ప్రభుత్వం యునైటైడ్ బ్రేవరేజ్ సంస్థ చెప్పిన దానికి ఓకే అంటే తెలంగాణలో ఆ బ్రాండ్ బీర్లతో పాటు మిగతా బ్రాండ్ల బీర్ల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే కింగ్ ఫిషర్ దాదాపు రూ. 160 నుంచి రూ. 175 మధ్య ఉంది.

తాజాగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయంతో తెలంగాణలో స్ట్రాంగ్ బీర్ల ధర ఏకంగా రూ. 250 వరకు పలకనుంది. ముఖ్యంగా బీర్ల కోసం భారీగా నీటిని వినియోగించుకోవాల్సి ఉంటుంది.

మరోవైపు ప్రభుత్వం బీర్ల తయారీ చేసుకోవాలంటే బోర్లు కాకుండా.. ట్యాంకర్లను తెప్పించుకోవాలని బ్రేవరేజేస్ సంస్థకు సూచిస్తుంది. నీటిని ట్యాంకర్ల తర్వాత తెప్పించుకోవడం వలన కంపెనీలకు భారీగా ఖర్చు అవుతుంది. అది రేట్లు పెంచుకోవడం ద్వారా పూడ్చుకోవాలని సూచిస్తుంది.

ఏది ఏమైనా రాబోయే ఎండాకాలంలో బీర్లకు భారీ డిమాండ్ ఏర్పడనుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం బీర్ల ధరలతో పాటు మాములు లిక్కర్ ధరలను పెంచే యోచనలో ఉంది.

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link