Lizard Falling: బొడ్డు మీద బల్లి పడితే లక్ష్మీ కటాక్షమే.. వజ్రాలు, బంగారం మీ సొంతం
బల్లి శాస్త్రం: బల్లి శరీరంపై పడిన చోటను బట్టి శుభం జరుగుతాయి.. కొన్ని కీడు కూడా జరుగుతాయనే నమ్మకాలు హిందూవుల్లో ఉన్నాయి.
శరీరంపై బల్లిపడటం: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బల్లిని శుభప్రదంగా భావిస్తారు. బల్లి శరీరంపై పడడంపై బల్లిశాస్త్రం ఇలా చెబుతోంది.
తలపై: తలపై బల్లి పడితే చెడు శకునాన్ని సూచిస్తుంది. తలపై పడితే చెడు సమయం ఎదుర్కోంటారని హెచ్చరికలాంటిది. తలపై బల్లి పడితే ఒక వ్యక్తి బంధువు లేదా తెలిసిన వ్యక్తి చనిపోవచ్చు. మనశ్శాంతిని కోల్పోవచ్చు.
నుదుటిపై: బల్లి పడటం నుదుటిపై పడడం శుభసూచకంగా భావిస్తారు. నుదుటిపై ఎడమవైపు పడితే కీర్తి.. కుడి నుదుటిపై పడితే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని శాస్త్రం చెబుతోంది. ముఖం మీద బల్లి పడితే ఇంటికి బంధువులు వస్తారని అంటారు.
కనుబొమ్మలపై: బల్లి కనుబొమ్మలపై పడితే కార్యాలయంలోని అధికారులు మీకు సహాయం అందిస్తారు. బల్లి కళ్లపై పడితే వారికి గండం ఉన్నట్టు భౄవించారు. ఎడమ చేతిపై లేదా ఎడమ కాలుపై బల్లి పడితే ఆ రోజంతా మంచి జరుగుతుందని నమ్మకం.
కుడి చేయి.. కాలు: కుడి చేయి, కుడి కాలుపై బల్లి పడితే ఆ రోజు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పాదాలపై పడితే విదేశాలకు వెళ్లే అవకాశం వస్తుందని నమ్మకం. నాభి (బొడ్డు) ప్రాంతంలో బల్లి పడితే బంగారం.. వజ్రాలు వంటి విలువైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం.
కుడి పాదం: బల్లి కుడి పాదంపై పడితే అనారోగ్యం కలిగే ప్రమాదం ఉంది. ఎడమ కాలు మీద బల్లి పడితే ఆరోగ్యంపై జాగ్రత్తగా ఉండాలి. ఒడిలో బల్లి పడితే మీ తల్లిదండ్రులకు ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉన్నాయి.
కుడి ఛాతీ: బల్లి కుడి ఛాతీపై పడితే మేలు జరుగుతుంది. ఎడమ ఛాతీపై బల్లి పడితే ఆనందం.. మెడలో ఎడమవైపు పడితే వ్యాపారంలో విజయం.. కుడి వైపు పడితే బంధువు లేదా ఇతర వ్యక్తితో శత్రుత్వం వస్తుందనే నమ్మకాలు ఉన్నాయి.
ఏం చేయాలి?: శరీరంపై బల్లి పడితే వెంటనే స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత ఇంట్లో కానీ సమీపంలోని ఆలయానికి వెళ్లి ఏ దేవుడినైనా దర్శనం చేసుకోవాలి. బల్లితో ఎలాంటి అశుభాలు.. కష్టాలు రాకుండా దేవుడిని ప్రార్థించాలి.