Love Jihad: ఆ హిందీ సినిమాల్లో ఉన్నది లవ్ జిహాద్ కాదా?
కరణ్ జోహార్ నిర్మించిన మై నేమ్ ఈజ్ ఖాన్ ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న మత ఛాందసవాదాన్ని చూపిస్తుంది. సినిమాలో షారుఖ్ ఖాన్ ముస్లిం యువకుడిగా..హిందూ యువతి కాజోల్ ప్రేమలో పడతాడు.
సోనాలీ బింద్రే, అక్షయ్ ఖన్నాలు ప్రధాన పాత్రల్లో 1999లో విడుదలైన దహక్ సినిమా...అప్పట్లో ఓ సంచలనమే. ఈ సినిమాలో హిందూ, ముస్లిం యువతీ యువకుల మద్య సంబంధాన్ని చూపించారు. సోనాలీ బింద్రే ఇందులో డబుల్ రోల్ లో కన్పిస్తుంది.
అభిషేక్ కపూర్ దర్శకత్వంలో విడుదలైన కేదార్ నాధ్ సినిమా...ఇద్దరు యువతీ యువకుల ప్రేమ ఆధారంగా తీసింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ముస్లిం యువకుడిగా..సారా అలీఖాన్ హిందూ పర్యాటకురాలిగా నటించిన సినిమా ఇది. ఈ సినిమాను హిందూ సంస్థలు వ్యతిరేకించాయి.
మణిరత్నం దర్శకత్వంలో 1995లో విడుదలైన బాంబో సినిమా అప్పట్లో ఓ సంచలనం. రెండు మతాలకు చెందిన యువతీ యువకుల మధ్య చిగురించిన ప్రేమకు దర్పణమిది.ఏఆర్ రెహమాన్ సంగీతంలో..అరవింద్ స్వామి, మనీషా కోయిరాలా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.