LPG Cylinder Price Hike: ఎల్పీజీ సిలిండర్ ధరలు పెంపు.. తాజా ధరలు ఇలా!
LPG Gas Cylinder Price Hike: ద్రవ్యోల్బణంతో కొత్త సంవత్సరం 2021 ప్రారంభమైంది. ఐఓసిఎల్ ప్రతి నెల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను సమీక్షిస్తుంది. ఈ నేపథ్యంలో నూతన సంవత్సరం రోజున కొత్త రేటును ప్రకటించింది. వంటగదిలో ఉపయోగించే సబ్సిడీ లేని 14.2 కిలోల సిలిండర్ల ధరలలో ఐఓసీ ఏ మార్పులు చేయలేదు. కానీ 19 కిలోల LPG సిలిండర్ ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
Also Read: LPG Subsidy పై కేంద్రం కీలక నిర్ణయం.. ఇంతకి సబ్సిడీ వస్తుందా..లేదా ?
ఐఓసి వెబ్‌సైట్ ప్రకారం హైదరాబాద్‌లో 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర (LPG Gas Price in Hyderabad) రూ.696.50, ఢిల్లీలో ధీని ధర రూ.694, కోల్‌కతాలో రూ.720.50, ముంబైలో రూ .694, చెన్నైలో రూ.710గా ఉంది. డిసెంబరులో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు రెండుసార్లు పెరిగాయి. డిసెంబరులో 14.2 కిలోల నాన్ సబ్సిడీ, 19 కిలోల వాణిజ్య సిలిండర్లపై ధర పెరిగింది.
19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచారు. ఐఓసీ వెబ్‌సైట్ ప్రకారం, ఢిల్లీలో 19 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.1349 రూపాయలకు చేరుకుంది. గతంలో ఇది రూ.1,332 కాగా, ప్రస్తుతం రూ.17 మేర పెరిగింది. ముంబైలో రూ .17 పెరగడంతో 19కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.1280.50 నుండి 1297.50 రూపాయలకు పెరిగింది. చెన్నైలో దీని ధర రూ.1446.50 నుంచి రూ .1463.50కు పెరిగింది.
వినియోగదారులకు గృహ అవసరాల కోసం సంవత్సరానికి 14.2 కిలోల సిలిండర్లు 12 వరకు కేంద్ర ప్రభుత్వం రాయితీ కల్పిస్తోంది. ఆ 12 వంటగ్యాస్ సిలిండర్లపై రాయితీని పొందవచ్చు. ఆ కోటా పూర్తయ్యాక మార్కెట్ ధరలకే ఎల్పీసీ సిలిండర్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
ఎల్పీజీ సిలిండర్ల ధరను చెక్ చేయడానికి, మీరు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెబ్‌సైట్‌కు వెళ్లాలి. ఇక్కడ కంపెనీలు ప్రతి నెలా కొత్త రేట్లను అప్‌డేట్ చేస్తాయి. అధికారిక వెబ్‌సైట్ కోసం క్లిక్ చేయండి https://iocl.com/Products/Indanegas.aspx