LPG Gas Cylinder Price: సామాన్యులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు..
మే డే మొదటి రోజు గ్యాస్ ధరలు భారీగా తగ్గాయి. ఈ ధరల తగ్గుదల సామాన్యులకు కాస్త ఊరటనిచ్చే విషయమే. గ్యాస్ ధరలు భారీగా ఈ విధంగా భారీగా తగ్గాయి. ప్రతినెల మొదటి రోజు గ్యాస్ ధరలను ఆయిల్ కంపెనీలు సవరిస్తాయి. ఈరోజు కూడా ఎల్పీజీ, కమర్షియల్ గ్యాస్ ధరలు సవరించాయి. తగ్గిన గ్యాస్ ధరలతో కొత్త ధరల వివరాలు ఇలా ఉన్నాయి..
కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు రూ. 19 తగ్గింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు బుధవారం కొత్త ధరలను అప్డేట్ చేశాయి. ఢిల్లీలో రిటైల్ ధరలు రూ. 19 కేజీ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1,745.50 ఉంది.
మనదేశంలో వివిధ ప్రధాన నగరాల్లో కూడా దగ్గరదగ్గరగా అంతే ఉన్నాయి. ముంబైలో కూడా గ్యాస్ సిలిండర్ ధరలు రూ. 1,698.50 ఉంది. ఇక చెన్నైలో రూ. 1,911, కోల్‌కత్తాలో కూడా కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ ధరలు రూ.1,859 ఉంది. ఈ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు ప్రాంతాలవారీగా స్థానిక ట్యాక్స్ ల ఆధారంగా ధరల మార్పు ఉంటుంది.
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) ఎల్‌పీజీ ధరలను ప్రతినెల సవరిస్తాయి. ప్రతినెల మొదటిరోజు ఉదయమ 6 గంటలకు ధరల సవవరణ చేస్తాయి. వాటిని వినియోగదారులకు ప్రకటిస్తాయి.
ఈ ధరల తగ్గుదల 19 కేజీలు, 5 కేజీలు కమర్షియల్ సిలిండర్లకు వర్తిస్తాయని తెలిపాయి. ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ధరలు గత మూడు రోజులుగా తగ్గుదల కారణంగా ఎల్‌పీజీ గ్యాస్ ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇక మాములు ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు అలాగే ఉన్నాయి. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో సామాన్యులకు ఈ ధరల తగ్గుదల కాస్త ఉపశమనం కలిగిస్తుంది.