Lucky Gemstones: ఈ 5 రత్నాలు ఇలా ధరిస్తే..పేదరికం మటుమాయం, వద్దంటే వచ్చి పడే డబ్బు
టోపాజ్
రత్నశాస్త్రం ప్రకారం ప్రతి రత్నానికి ఓ గ్రహం అధిపతిగా ఉంటుంది. ఈ క్రమంలో టోపాజ్ రత్నం పసుపుగా ఉండి మెరుస్తుండే రత్నంకు గురగ్రహం అధిపతి. ఈ రత్నం ధరించడం వల్ల ఆ వ్యక్తి ధన సంపదలు పెరుగుతాయి.
టైగర్ స్టోన్
రత్నశాస్త్రం ప్రకారం టైగర్ స్టోన్ ధరించడం వల్ల ఆ వ్యక్తి జీవితంలో సూర్య, చంద్ర గ్రహాలు బలోపేతంగా ఉంటాయి. రత్నశాస్త్రం ప్రకారం ఈ రత్నం ధరించడం వల్ల వ్యక్తి దురదృష్టం దూరమౌతుంది. వ్యాపారం ఆర్ధికంగా లాభపడతారు.
రూబీ జెమ్‌స్టోన్
రత్నశాస్త్రం ప్రకారం రూబీ జెమ్‌స్టోన్ సూర్యుడికి సంబంధించింది. ఈ రత్నం ధరించడజం వల్ల సూర్యుడి స్థితి బలోపేతమై అంతా శుభప్రదంగా ఉంటుంది. ఈ రత్నం ధరించడం వల్ల ఆ వ్యక్తి బుద్ధి వికసిస్తుంది.
జెడ్ స్టోన్
జ్యోతిష్యం ప్రకారం బుధ గ్రహంకు సంబంధించింది ఈ రత్నం. ఈ రత్నం ధరించడం వల్ల బుధుడికి సంబంధించి శుభ పరిణామాలు కలుగుతాయి. వ్యాపారం అభివృద్ధి అవుతుంది. బుధుడిని బలోపేతం చేసేందుకు జెడ్ స్టోన్ ధరించమంటారు జ్యోతిష్యులు.
గ్రహాలు శుభ ఫలాలు ఇవ్వాలంటే..
రత్నశాస్త్రంలో వ్యక్తి ఆర్ధిక ఇబ్బందుల్ని దూరం చేసే చాలా రకాల రత్నాల గురించి వివరణ ఉంది. రత్నశాస్త్రం ప్రకారం గ్రహాల దశ ప్రభావం వ్యక్తి జీవితంపై పడుతుంటుంది. రత్నాలనేవి ఎవరైనా వ్యక్తి కుండలిలో గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు ప్రతికూల ప్రభావం పడకుండా తప్పిస్తాయి. అందుకే గ్రహాల్ని బట్టి ఎవరు ఏ రత్నం ధరించాలనేది రత్నశాస్త్రం చెబుతుంటుంది.
కోరల్ జెమ్‌స్టోన్
జ్యోతిష్యం ప్రకారం ప్రతి రత్నానికి విశేషం ఉంది. కోరల్ జెమ్‌స్టోన్ మంగళ గ్రహాన్ని పటిష్టం చేసేందుకు ధరిస్తారు. రత్నశాస్త్రం ప్రకారం ఈ రత్నం ధరించడం వల్ల రాజకీయాలు, వైద్య రంగంలో ఉండేవారికి విజయం లభిస్తుంది. అంతేకాకుండా మంగళ గ్రహానికి సంబంధించిన దోషాలుంటే దూరమౌతాయి.