Lunar Eclipse 2021: చంద్ర గ్రహణం ఈ రాశుల వారిపై ప్రభావం చూపుతుంది

Wed, 26 May 2021-2:14 pm,

Lunar Eclipse 2021 : మేషరాశి వారిపై చంద్రగ్రహణం ప్రభావం అద్భుతంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అదే సమయంలో మేష రాశి వారు కొన్ని విషయాలలో మానసిక ఆందోళనకు గురవుతారు. చాలా కాలం నుంచి పక్కన పెట్టిన పనులను పూర్తి చేయడానికి ఇది తగిన సమయంగా భావిస్తారు.

Also Read: Marriage Luck: ఈ రాశులలో జన్మించిన అమ్మాయిలకు పెళ్లి తరువాత సిరిసంపదలు, సుఖశాంతులు!

Cancer: కర్కాటక రాశివారు చంద్రగ్రహణం ప్రభావంతో అనారోగ్యం బారిన పడతారు. కనుక కచ్చితంగా వారు పోషకాలు లభించే ఆహారం తీసుకోవాలి. రోగ నిరోధక శక్తి పెంచుకోవడంపై ఫోకస్ చేయాలి. ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న సొంతింటి కల సాకారం కానుంది. వ్యాపారులకు లాభాలు గోచరిస్తున్నాయి. పెట్టుబడులకు ఆసక్తి చూపుతారు.

Also Read: Rainbow In Dreams: మీ కలలో ఇంద్రధనస్సును చూశారా, దాని అర్థం ఏంటంటే

Virgo: కన్య రాశి వారిపై చంద్ర గ్రహణం ప్రభావం కచ్చితంగా ఉంటుంది. చంద్ర గ్రహణం అనంతర కాలంలో కొన్ని విషయాలలో మీరు వృద్ధి చెందుతారు. ఆర్థిక పరిస్థితి మెరగవుతుంది. వ్యాపారం చేసేవారికి లాభాలు వస్తాయి. అయితే ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకూడదు.

Also Read: Dreams: కలలో ఈ జంతువులు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకోండి

Capricorn: మకర రాశి వారు తమ కెరీర్‌లో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. కెరీర్‌లో మరో కీలక అడుగు వేయనున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link