Maggi Noodles: చిల్లీ గార్లిక్ మ్యాగీ మసాలా రెసిపీ.. టేస్ట్ చేస్తే మతిపోతుంది..!
చిల్లీ గార్లిక్ మ్యాగీ మసాలా రెసిపీ ఎంతో ప్రసిద్ధి చెందిన రెసిపీ. ఇది పిల్లలకు ఎంతో ఇష్టంగా తింటారు. ఇంట్లో తరుచు ఉపయోగించే పదార్థాలను వాడి దీని తయారు చేసుకోవచ్చు.
కావాల్సిన పదార్థాలు: మ్యాగీ నూడుల్స్ ప్యాకెట్, వెల్లుల్లి రెబ్బలు (తరిగినవి), ఎర్ర మిరపకాయలు (తరిగినవి), సోయా సాస్, వెనిగర్, ఉప్పు, నూనె, కొత్తిమీర (తరిగినది),
తయారీ విధానం: ఒక పాత్రలో నీరు మరిగించి, మ్యాగీ నూడుల్స్ ప్యాకెట్‌లో ఇచ్చిన మసాలా పొడి వేసి, నూడుల్స్ వండుకోండి.
వేడి చేసిన నూనెలో వెల్లుల్లి, ఎర్ర మిరపకాయలు వేసి వేగించండి. వాసన వచ్చాక, వండిన నూడుల్స్‌ను వేసి బాగా కలపండి.
సోయా సాస్, వెనిగర్, ఉప్పు వేసి రుచికి తగినట్లుగా సర్దుబాటు చేసుకోండి.
కొత్తిమీర తరుగు వేసి బాగా కలిపి వెంటనే సర్వ్ చేయండి.