Maghapurnima 2024: రేపు మాఘ పౌర్ణమి.. ఈ రోజు రాత్రి చంద్రుని వెలుగులో ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బుల వర్షమే..
చాలా మంది లైఫ్ లో ఎంతో కష్టపడిన కూడా గ్రోత్ ఉండదు. లైఫ్ లో చక్కగా సెటిల్ కారు. చదివిన చదువులకు చేస్తున్న ఉద్యోగాలకు అస్సలు పొంతన ఉండదు. దీంతో లైఫ్ లో ఎప్పుడు నిరాశతో ఉంటారు.
మరికొందరు పెళ్లిళ్లు కుదరక తెగ సఫర్ అయిపోతుంటారు. ఇలాంటి వారు మాఘమాసంలో పౌర్ణమిరోజున ఇలా చేస్తే ఈసమస్యలన్నింటికి చెక్ పెట్టేయోచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు.
మాఘమాసంలోని పౌర్ణమికి ఒక రోజు ముందు రాత్రి చంద్రుడి వెన్నలమన మీద పడేలా కూర్చోవాలి. ఒక గిన్నెలో పాలు, ఏలకులు, చక్కెర, పటిక బెల్లం వేయాలి. దానిలో చంద్రుడిని చూస్తూ భక్తితో పూజలు చేయాలి.
రాత్రిపూట ఆసనంపై కూర్చుని తొమ్మిది సార్లు లలితా సహస్రనామ పారాయణ చేయాలి. ఇలా చేసేటప్పుడు ఎవరితో కూడా మాట్లాడకూడదు. అమ్మవారిని మనసులో ధ్యానిస్తూ ఉండాలి. ఆ తర్వాత ఆ పాలను ఆమ్మవారికి అర్పించి, మనంతాగాలి.
ఈవిధంగా లలితా దేవీ పారాయణ ఎవరైతే చేస్తారో.. వారికి జీవితంలో ఎప్పటికి డబ్బులు తక్కువ పడ్డాయని అస్సలు ఉండదు. ఎంత అయిపోయిన కూడా ఎక్కడి నుంచో ఒక వైపు నుంచి డబ్బులు వస్తునే ఉంటాయి.
పెళ్లికానీ వారు ఈరోజు రాత్రి.. వెన్నలలో కూర్చుని చంద్రుడిని మనస్పూర్తిగా ధ్యానం చేయాలి. అదే విధంగా నవగ్రహాలను కూడా ప్రత్యేకంగా పూజలు చేయాలి. ఇలా చేస్తే అతి త్వరలో వివాహ యోగం కల్గుతుందని పండితులు చెబుతుంటారు.