Magnesium Rich Foods: మెగ్నీషియం లోపం అంత డేంజరా, ఈ ఫుడ్స్ తీసుకోండి
అరటి పండ్లు
అరటి పండ్లలో పొటాషియంతో పాటు మెగ్నీషియం కూడా పెద్దఎత్తున ఉంటుంది. ఒక అరటి పండులో 32 మిల్లీగ్రాముల మెగ్నీషియం లబిస్తుంది.
డార్క్ చాకోలేట్స్
మెగ్నీషియం లోపం తీర్చేందుకు మరో బెస్ట్ పదార్ధం డార్క్ చాకోలేట్స్. 28 గ్రాముల డార్క్ చాకోలేట్‌లో 64 మిల్లీగ్రాముల మెగ్నీషియం ఉంటుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఆనపకాయ గింజలు
ఆనపకాయ గింజల్లో మెగ్నీషియం భారీగా ఉంటుంది. కేవలం 28 గ్రాముల ఆనపకాయ గింజలు తీసుకుంటే అందులో 150 మిల్లీగ్రాముల మెగ్నీషియం లభిస్తుంది.
వాల్‌నట్స్, బాదం
డ్రై ప్రూట్స్‌లో వాల్‌నట్స్, బాదంలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. 28 గ్రాముల బాదంలో 80 మిల్లీగ్రాములు మెగ్నీషియం ఉంటుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది.
పాలకూర
పాలకూరలో మెగ్నీషియం పెద్దఎత్తున ఉంటుంది. 100 గ్రాముల పాలకూరలో 79 మిల్లీగ్రాముల మెగ్నీషియం ఉంటుంది. పాలకూరను రోటీతో లేదా అన్నంతో తీసుకోవచ్చు. ఇందులో మెగ్నీషియంతో పాటు ఐరన్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి.