Magnesium Importance: మెగ్నీషియంతో మహిళలకు ఎందుకు అవసరం, ఏయే లాభాలున్నాయి

ఎముకలకు బలం
విటమిన్ డిని యాక్టివ్ ఫామ్‌లో మార్చేందుకు మెగ్నీషియం చాలా చాలా అవసరం. కాల్షియం సంగ్రహణ, మెటబోలిజంతో పాటు పారా థైరాయిడ్ హార్మోన్ పనితీరును మెరుగుపరుస్తుంది. మహిళల్లో ఆస్టియోపోరోసిస్, ఎముకల బలానికి ఉపయోగపడుతుంది. మెనోపాజ్ తరువాత మహిళలు మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ తప్పకుండా తినాలి

మంచి నిద్ర
మెగ్నీషియం అనేది రిలాక్సేషన్ ఇస్తుంది. స్లీప్ వేకప్ సైకిల్‌ను నియంత్రిస్తుంది. ఇది మెలటోనిన్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తుంది. నిద్ర ప్రక్రియను ప్రభావితం చేసేది ఈ హార్మోనే. ఫలితంగా మంచి నిద్ర పడుతుంది

పీరియడ్స్ నొప్పి నుంచి ఉపశమనం
పీరియడ్స్ సమయంలో మహిళలకు తీవ్రమైన నొప్పి ఉంటుంది. మెగ్నీషియంతో ఈ నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. గర్భాశయం కండరాలు ఫ్రీ అవుతాయి. పీరియడ్స్ క్రాంప్స్ తగ్గుతాయి.
ప్రెగ్నెన్సీలో ప్రయోజనం
గర్భిణీ మహిళకు శరీరంలో టిష్యూ నిర్మాణం, మరమ్మత్తులో దోహదం చేస్తుంది మెగ్నీషియం. మెగ్నీషియం లోపిస్తే ప్రీ ఎక్లాంప్సియా వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి. 19 నుంచి 30 ఏళ్ల వయస్సులో గర్భిణీ మహిళలుకు రోజుకు 350 మిల్లీగ్రాముల మెగ్నీషియం అవసరమౌతుంది
స్వెల్లింగ్ తగ్గడం
మెగ్నీషియం తక్కువగా ఉండే ఫుడ్స్ తింటే స్వెల్లింగ్ పెరుగుతుంది. మెగ్నీషియం అనేది ఈ సమస్యను తగ్గిస్తుంది. సి రియాక్టివ్ ప్రోటీన్, ఇంటర్ ల్యూకిన్ 6, స్వెల్లింగ్ వంటి సమస్యలు తగ్గుతాయి.