Chenchalamma Photos: మగువా ఓ మగువా సీరియల్‌ చెంచలమ్మ.. రియల్‌ లైఫ్‌లో ఎలా ఉంటారో తెలుసా? పిక్స్‌ వైరల్‌ ..

Wed, 11 Sep 2024-10:11 am,

చెంచలమ్మ అసలు పేరు నేత్ర జాదవ్‌. ఈమె కన్నడ యాక్ట్రెస్‌. ఈమె కన్నడలో ఆరుకు పైగా సీరియల్స్‌లో నటించారు. ఈటీవీలో ప్రసారమైన లక్ష్యం, రావోయి చందమమ్మ అనే సీరియల్‌లో ఇంద్రసేనగా నటించి మెప్పించారు. ఈ సీరియల్‌ నుంచి తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు నేత్రకు వచ్చింది.  

ఆ తర్వాత మాటీవీలో ప్రసారమవుతున్న మగువా ఓ మగువాలో చెంచలమ్మ అనే పవర్‌ఫుల్ క్యారక్టర్‌ దక్కించుకున్నారు. ఈ సీరియల్‌లో నటిస్తున్న నేత్ర ఇందులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సీరియల్‌ మొదటి వారంలోనే మంచి టీఆర్‌పీని సొంతం చేసుకుంది..  

మగువా ఓ మగువా అత్తకోడళ్ల మధ్య సాగుతున్న కథ. ఇందులో తెలుగు యాక్టర్‌ శ్రవణ్‌ హీరోగా నటిస్తున్నారు. హిరోయిన్‌గా కృతికా ఉమా శేఖర్ అనే కొత్త అమ్మాయిని తీసుకున్నారు.  

ఇక ఈ సీరియల్‌లో అత్త క్యారక్టర్‌లో చెంచలమ్మగా నేత్ర పవర్‌ఫుల్‌ రోల్‌లో నటిస్తున్నారు. ఈమె ఆ క్యారక్టర్‌లో అద్భుతంగా నటిస్తున్నారు. తెలుగులో నేత్రకు ఇది మూడో సీరియల్‌. కన్నడ సీరియల్స్‌లోనే కాదు పలు సినిమాల్లో కూడా నటించారు.  

అయితే, రియల్‌ లైఫ్‌లో చెంచలమ్మ ఎలా ఉంటారో చూస్తే షాకవుతారు. ఆమె మోడ్రన్‌ లుక్‌లో కనిపిస్తారు. అసలు చెంచలమ్మనే ఈమె అని ముక్కున వేలేసుకుంటారు కూడా. చెంచలమ్మ రియల్‌ లైఫ్‌కు సంబంధించిన కొన్ని చిత్రాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.  

మగువా ఓ మగువా సీరియల్‌ తెలుగు ప్రేక్షకులు తెగ ఆదరిస్తున్నారు. దీనికి చాలా పవర్‌ ఫుల్‌ క్యారెక్టర్‌లో చెంచలమ్మగా నేత్రా జాదవ్‌, ఇక హీరో అమాయకపు క్యారక్టర్‌, కోడలు పెళ్లి చేయాలని ఆమె చేసే తాపత్రయం వెరసి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ పొందుతోంది.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link