Mahalaya Pitru Paksham: మహాలయ పక్షాల్లో ఎలా శ్రాద్దం పెట్టాలి.. ? ఇలా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..

Wed, 18 Sep 2024-9:40 pm,

ముఖ్యంగా కన్నుమూసిన తండ్రి, తాత, ముత్తాతలను తలచుకుని పుత్రులు నిర్వహించే శ్రాద్ధ తర్పణ, పిండప్రదానాది పితృయజ్ఞ విధులన్నీ జరుపుకోవడానికి నిర్దేశించబడిన ఈ పదిహేను రోజులనే మహాలయ పక్షాలు అంటారు. వీటినే పితృపక్షము లేదా అపర పక్షములనీ కూడా పిలుస్తుంటారు.

మరణించిన మన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి, వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షముల ముఖ్య ఉద్దేశ్యము. 18-09-2024 నుండి 02.10.2024 వరకు మహాలయ పక్షాలు ప్రారంభమయ్యాయి. భాద్రపద బహుళ పాడ్యమి నుంచి భాద్రపద అమావాస్య వరకు ఉన్న  పదిహేను రోజులు మహాలయ పక్షములుగా వ్యవహరిస్తారు.

పితృదేవతలకు.... ఆకలా...? అనే సందేహం కలుగవచ్చు. ఈ కనిపించే సకల చరాచర జగత్తు మొత్తం ఆకలి అనబడే సూత్రం మీదనే నడుస్తోంది.

అన్నం వలన ప్రాణికోటి జన్మిస్తుంది. వర్షం వలన అన్నం లభిస్తుంది. యజ్ఞం వలన వర్షం కురుస్తుంది. ఆ యజ్ఞం కర్మ వలననే సాధ్యమౌతుంది ఇది భగద్గీతలో శ్రీ కృష్ణుడు చెప్పిన మాట. 

అంటే... అన్నం దొరకాలంటే మేఘాలు వర్షించాలి. మేఘాలు వర్షించాలంటే... దేవతలు కరుణించాలి. దేవతలు కరుణించాలంటే వారి ఆకలి తీరాలి. వారి ఆకలి తీరాలంటే యజ్ఞాల ద్వారా వారి వారి హవిర్భాగాలు అందజేయాలి. ఎందుకు ఇంత తతంగం అని అడగొచ్చు.

మరణించిన ప్రాణి ఆత్మ రూపంలో పితృలోకంలో ఉంటుంది. ఆ ఆత్మ తన పూర్వకర్మానుభవం కోసం తిరిగి ఈ భూమి మీద జీవాత్మగా అవతరించడానికి ... అన్నాన్ని ఆశ్రయించి, తద్వారా పురుషప్రాణి దేహంలో ప్రవేశించి, శుక్ల కణముగా మారుతుంది. ఆ తర్వాత స్త్రీ గర్భకోశంలో ప్రవేశించి, శిశువుగా రూపాంతరం చెంది ఈ భూమి మీదకు వస్తుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link