Mahalaya Pitru Paksham: తద్దినాలు పెడుతున్నాం కదా..! మహాలయ పక్షాల్లో శ్రాద్ధం పెట్టాలా..?

Thu, 19 Sep 2024-7:53 am,

Mahalaya Pitru Paksham: మరణించిన మన పితరులకు మోక్షం కలగాలంటే కర్మ పరిపక్వం కావాలి. అలా జరగాలంటే... పితృదేవతలు దేహధారణ చేసి ఈ లోకంలోకి రావాలి. అలా రావాలంటే వారికి అన్నాన్ని అందించాలి. అది రక్తం పంచుకు పుట్టిన పుత్రులే అందించాలి. అప్పుడే వారికి పితృఋణం తీరుతుంది. ఋణం తీరడమే మోక్షం అంటే. ఎవరికైనా ఇంతే•

అనే సందేహం తిరిగి కలుగవచ్చు. మరణించిన తండ్రి తిథి నాడు పుత్రుడు తద్దినం పెట్టడం హిందూ సాంప్రదాయంలో అనాది నుంచి వస్తున్న ఆచారం.

పితృ తిథి నాడు పుత్రుడు తన తండ్రి, తాత, ముత్తాతలను తలచుకుని పితృయజ్ఞాన్ని నిర్వహిస్తాడు.మరి పుత్రులు లేనివారి సంగతి ఏమిటి ? వారి గతి అధోగతేనా ? అంటే కాదు అంటుంది  ధర్మ శాస్త్రం.

మన కుటుంబాలలో ఏ కారణం చేతనో పెళ్ళికాని సోదర, సోదరీలు మరణించి ఉండవచ్చు. లేదా పెళ్ళయినా సంతానం కలుగని దంపతులు మరణించి ఉండవచ్చు. లేదా ప్రమాదాల్లో మరణించిన చిన్న పిల్లలు ఉండవచ్చు. లేదా యుద్ధాలలో కానీ , శిక్షల ద్వారా కానీ, ఆత్మహత్యల వల్ల కానీ, ప్రకృతి వైపరీత్యాల (భూకంపాలు, వరదలు) ద్వారా కాని గుర్తు తెలియక మరణించి ఉండవచ్చును. అటువంటి వారందరికి కూడా తిలోదకాలిచ్చి వారిని ఊర్ధ్వలోకాలకు పంపడం కోసమే ఈ మహాలయ పక్షాలు నిర్దేశించబడ్డాయి.

పితృతిథి నాడు మూడు తరాల వారికి పితృ, పితామహా, ప్రపితామహా (తండ్రి , తాత , ముత్తాత) మాత్రమే తిలోదకాలతో పిండ ప్రదానం ఇవ్వబడుతుంది.

కానీ, ఈ మహాలయ పక్షాలు , పదిహేను రోజుల్లో వంశంలో మరణించిన వారందరికీ మాత్రమే కాక , పుత్రులు లేని గురువులకు (గురువు కూడా తండ్రితో సమానం) స్నేహితులకు కూడా తిలోదకాలతో, పిండప్రదానం ఇచ్చే అర్హత, అధికారం ఉంటుంది. దీనినే సర్వకారుణ్య తర్పణ విధి అంటారు.

ఏ కారణం చేతనైనా తద్దినం పెట్టలేని పరిస్థితి ఏర్పడి, తద్దినం, పెట్టకపోతే ఆ తద్దినం పెట్టని దోషం మహాలయ పక్షాల్లో పెట్టడం వలన పోతుందనేది ధర్మ శాస్త్రం చెబుతుంది. పితృయజ్ఞం చేసిన వారసునికి సకల ఐశ్వర్యాలు కలగాలనీ .. పిల్లపాపలతో ఆనందంగా ఉండాలనీ ఈ సందర్భంగా దీవిస్తారు.

 

మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి?

సాధారణంగా తండ్రి చనిపోయిన తిథినాడు మహాలయం పెట్టడం  అత్యుత్తమం. ఏ కారణం చేతనైనా అలా పెట్టడం వీలుకాని పరిస్థితిలో మహాలయ అమావాస్య నాడు పెట్టడం అత్యంత  ప్రశస్తం. దీనినే.. సర్వ పితృ అమావాస్య అంటారు. ఈ రోజునే మరణించిన బంధువులందరికీ...వారి వారి తిథులతో సంబంధం లేకుండా మహాలయం శ్రాద్ధం పెట్టాలి.

గతేడాడి చనిపోయిన వారికి భరణి లేదా భరణి పంచమి తిథులలో అనగా మహాలయ పక్షాలు మొదలైన 4 లేక 5 రోజున మహాలయం పెట్టాలి.

భార్య మరణించిన వాడు అవిధవ నవమినాడు అనగా తొమ్మిదవ రోజున మహాలయం పెట్టాలి. ఆ రోజున సుమంగళిగా మరణించిన తన భార్యను తలచుకుని ఒక సుమంగళికి భోజనం పెట్టి, పసుపు, కుంకుమ, గాజులు, పూవులు, చీర, పెట్టి  సత్కరించి పంపాలి.

చిన్న పిల్లలు చనిపోతే... వారికి పన్నెండవ రోజున మహాలయం పెట్టాలి. చిన్న పిల్లలు అంటే ఉపనయన వయస్సు (పది సంవత్సరములు) దాటనివారు. ఒకవేళ పది సంవత్సరముల వయస్సు లోపే ఉపనయనము జరిగి ఉంటే... ఆ పిల్లవాడు మరణించిన తిథినాడే మహాలయం పెట్టాలి. ఇక ప్రమాదాలలో కానీ, ఉరిశిక్ష వల్ల కానీ, ఆత్మహత్య చేసుకుని మరణించిన వారికి ఘటచతుర్థి నాడు అనగా అమావాస్య ముందు రోజున పెట్టాలి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link