Mumbai Woman With 4 Lakhs: రూ. కోటి ప్యాకేజీ ఉన్న అబ్బాయే కావాలి.. అద్దంలో ముఖం చూసుకొమ్మంటూ నెటిజన్లు ఫైర్..

Thu, 04 Apr 2024-10:24 pm,

ప్రస్తుతం అమ్మాయిలకు పెళ్లిళ్ల విషయంలో ఫుల్ డిమాండ్ ఉందని చెప్పుకొవచ్చు. తమకు నచ్చిన వారిని భర్తగా ఎంపిక చేసుకునే పూర్తి బాధ్యతలు వారే తీసుకున్నట్లు తెలుస్తుంది. ఎడ్యుకేషన్ క్వాలీఫికేన్స్, ప్రాపర్టీ, ప్యాకేజీ ఇలా ప్రతిదాంట్లో కూడా అమ్మాయిలు ఫుల్ గా క్లారిటీతో ఉంటున్నారు. ఒకప్పుడు అమ్మాయిలు.. పెద్దవాళ్లు కుదిర్చన అరెంజెడ్ పెళ్లిళ్లు చేసుకునే వారు.

 

పెళ్లికి ముందువరకు కూడా అబ్బాయిలు అమ్మాయిలు అస్సలు మాట్లాడుకోవడం కానీ చూసుకొవడం కానీ ఉండేది కాదు. కానీ ఇప్పుడుమాత్రం ట్రెండ్ పూర్తిగా మారిపోయింది.తమకు నచ్చిన అబ్బాయిని మాత్రమే అమ్మాయిలు పెళ్లిచేసుకొవడానికి ఆసక్తిచూపిస్తున్నారు. అమ్మాయిలు ఎక్కువగా పెళ్లికి ముందే డేటింగ్ ను కూడా చేస్తున్నారు. మరీకొందరైతే లీవ్ ఇన్ రిలేషన్ షిప్ లో కూడా ఉంటున్నారు. 

కొన్నిరోజులు కలిసి సహావాసం చేస్తే, వీరి అభిప్రాయాలు, అభిరుచులు కలిస్తే కలసి  ముందుకు వెళ్తున్నారు. లేకుంటే సింపుల్ గా బ్రేకప్ చెప్పుకుంటున్నారు. అందుకే యువత ఎక్కువ మంది ప్రేమ పెళ్లిళ్లు చేసుకొవడానికి ఆసక్తిచూపిస్తున్నారు. ప్రేమ పెళ్లిళ్లలో ఇద్దరు కలిసి ఉంటూ, కొంత లైఫ్ లో జర్నీ చేస్తారు. ఆ తర్వాత కొందరు పెళ్లిచేసుకుని ఒకటౌతున్నారు  

ఇదిలా ఉండగా.. ఒకప్పుడు సర్కారు కొలువుకు మార్కెట్ లో ఫుల్ డిమాండ్ ఉంటేది. అమ్మాయికి, సర్కారు కొలువున్న అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. సర్కారు కొలువుంటూ కాదు.. అది కూడా పెద్ద లెవర్ పోస్టు ఉండాలని అమ్మాయిలు చూస్తున్నారు. ఇక సాఫ్ట్ వేర్ ఉద్యోగులైతే ఏడాదికి కనీసం రూ.కోటి వరకు సంపాదించాలంటా..

ముంబాయికి చెందిన ఒక అమ్మాయి ఫ్యామీలి అంతా కలిసి కేవలం 4 లక్షలు సంపాదిస్తున్నారు. ఈ కుటుంబంలోని యువతికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు దీంతో.. వరుడి కోసం మ్యాట్రిమోనీ వాళ్లను కన్సల్ట్ అయ్యారు. అమ్మాయి ఫ్యామిలీ వారు పెట్టిన డిమాండ్ లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అబ్బాయికి కోటీరూపాయల ప్యాకెజీ ఉండాలి. అదే విధంగా..  ముంబైలో సొంతిల్లు ఉండాలి, ఎంబీబీఎస్ సర్జన్ లేదా సీఏ చదివి ఉన్నతంగా సెటిల్ అయి ఉండాలని పేర్కొంది. యూజర్ తన ఖాతాలో.. @Ambar_SIFF_MRA ద్వారా ‘X’లో జీవిత భాగస్వామి కోసం పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇది ట్రెండింగ్ లో నిలిచింది.  

యువకులు చురుకుగా ఉంటూ,తరచుగా విదేశాలకు వెళ్లడంపై ఆసక్తికి కల్గి ఉండాలి. ముఖ్యంగా.. ఐరోపాలో, ఇటలీలకు తరచుగా వెళ్లేలా ప్లాన్ లు చేసుకుంటే మంచిదంట. ఇదిలా ఉండగా..“ఐటీ డేటా ప్రకారం, భారతదేశంలో కేవలం 1.7 లక్షల మంది మాత్రమే 1 కోటి కంటే ఎక్కువ ఆదాయం కలిగి ఉన్నారు. కాబట్టి ఆమె "కల" మనిషిని కనుగొనే అవకాశం 37 సంవత్సరాల వయస్సులో 0.01%" అనినెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.మరికొందరు పోయి అద్దంలో నీముఖం చూసుకో అంటూ ఏకీ పారేస్తున్నారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link