Mahashivratri 2023 Vrat Foods: మహా శివరాత్రి రోజు ఉపవాసంలో తీసుకునే అల్పాహరం ఫుడ్స్
ఉడకబెట్టిన ఆలుగడ్డ సాధారణంగా ఆలుగడ్డను ఆహారంగా తీసుకున్నప్పుడు అందులో ఉండే హై క్యాలరీల వల్ల ఎక్కువసేపు ఆకలిని దూరం చేస్తుంది. అందుకే ఉడకబెట్టిన ఆలుగడ్డను ముక్కలుగా కట్ చేసి పెరుగుతో అల్పాహారంగా తీసుకోవచ్చు.
సాబుదానా / సగ్గుబియ్యం ఉపవాసం పాటించే సమయంలో సగ్గు బియ్యంతో అనేక రకాల రెసిపిలు చేసుకోవచ్చు. సగ్గుబియ్యంతో జావా, కిచిడి వంటి ఫుడ్ ఐటమ్స్ అల్పాహారంగా చేసుకోవచ్చు.
పాలతో తయారు చేసిన ఆహార పదార్థాలు సాధారణంగా ఉపవాసంలో ఉన్నప్పుడు పాలతో తయారు చేసిన ఆహార పదార్థాలను ఆహారంగా తీసుకోవచ్చు. పాలు, పెరుగు, బర్ఫి, మఖానే ఖీర్ లాంటివి తీసుకోవచ్చు.
ఫ్రూట్ చాట్ మహా శివరాత్రి ఉపవాసం వేళ కొన్నిరకాల పండ్లతో తయారు చేసిన చాట్‌ని కానీ లేదా పండ్లను కానీ ఆహారంగా తీసుకోవచ్చని పండితులు చెబుతుంటారు.