Mahesh Babu Top Movies: మహష్ బాబు కెరీర్ ను ఛేంజ్ చేసిన టాప్ మూవీస్..
మహేష్ బాబు 1975 ఆగష్టు 9న కృష్ణ, ఇందిరా దంపతులకు జన్మించారు. ఈయన బాల నటుడిగా సినీ రంగ ప్రవేశం చేసి.. ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చిన తండ్రి తగ్గ తనయుడిగా రాణించారు. ఈయన కెరీర్ లో ఒక్కడు, పోకిరి సహా టాప్ చిత్రాల విషయానికొస్తే..
ఒక్కడు: గుణ శేఖర్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లో ఫస్ట్ టర్నింగ్ పాయింట్. ఆ తర్వాత మహేష్ వెనుదిరిగి చూసుకోలేదు.
సరిలేరు నీకెవ్వరు: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించిన సినిమా 'సరిలేరు నీక్వెవరు'. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న కథానాయికగా నటించింది.
మహర్షి: వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించిన సినిమా 'మహర్షి'. ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లో డిఫరెంట్ మూవీగా నిలిచింది.
భరత్ అను నేను: సూపర్ స్టార్ మహేష్ బాబు, కొరటాల శివ రెండోసారి కలిసి పనిచేసిన చిత్రం 'భరత్ అను నేను'. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
శ్రీమంతుడు: కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన మూవీ ‘శ్రీమంతుడు’. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయమే సాధించింది.
దూకుడు: శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లోనే డిఫరెంట్ మూవీగా నిలిచిపోయింది. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన సమంత నటించింది.
పోకిరి: మహేష్ బాబును ప్రిన్స్ నుంచి సూపర్ స్టార్ గా చేసిన సినిమా ‘పోకిరి’. ఎవడు కొడితే దిమ్మ దిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు అని మహేష్ చెప్పిన డైలాగులు ఓ రేంజ్ లో పేలాయి. పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేశాడు.
అతడు: మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘అతడు’. ఈ సినిమా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కల్ట్ క్లాసికల్ గా నిలిచింది.
మురారి: కృష్ణవంశీ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన చిత్రం ‘మురారి’. ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లోనే తొలి బ్లాక్ బస్టర్ అని చెప్పాలి.