Sitara: తండ్రి దారినే ఫాలో అవుతున్న సితార.. చిన్న వయసులోనే గొప్ప హృదయం..!

Mon, 23 Dec 2024-10:25 am,
Mahesh Babu Daughter

సినీ ఇండస్ట్రీలోకి రాకముందే సోషల్ మీడియా ద్వారా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకుంది సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని.. అభిమానులతో షేర్ చేసుకునే ఈ చిన్నది, ఇతరులకు సహాయం చేయడంలో తన తండ్రిని మించిపోయింది. సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన పనిని ఇంకొక కంటికి కూడా తెలియకుండా జాగ్రత్త పడతారు. కానీ ఆయన నుంచి సహాయం పొందిన వారు ఈ విషయాలపై స్పందిస్తే తప్ప ఎవరికి తెలియదనే చెప్పాలి.   

Mahesh Babu Daughter Charity

సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంతోమంది పిల్లల పాలిట దేవుడయ్యాడు. హార్ట్ ఆపరేషన్లు చేయించి మంచి మనసు చాటుకున్నారు. ఇప్పుడు ఆయన కూతురు కూడా మంచి పని చేయడానికి ముందుకు వచ్చింది. 

Sitara Ghattamaneni Charity Works

సితార మొదటిసారి పిఎంజే జ్యువెలర్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే.ఇక ఇందులో పనిచేసినందుకు తనకు వచ్చిన రెమ్యూనరేషన్ ని ఆమె తీసుకోకుండా ఒక చారిటబుల్ ట్రస్ట్ కి ఇచ్చి తన మంచి మనసు చాటుకుందట. అంతేకాదు ఈ విషయాన్ని పీఎంజే జ్యువెలర్స్ అధినేతలు స్పష్టం చేశారు. 

పీఎంజే జ్యువెలర్స్ మరో సరికొత్త క్యాంపెయిన్ ఆవిష్కరించింది. మా బ్రాండ్ అంబాసిడర్ సితార ఈ క్యాంపెయిన్ లో తళుక్కున మెరవడం మాకు చాలా సంతోషంగా ఉంది. మోడ్రన్ లిటిల్ ప్రిన్సెస్ సితార పీఎంజే జ్యువెలర్స్ విశిష్టతను, ప్రత్యేకతను ప్రతిబింబిస్తోంది. ఈ క్యాంపెయిన్ లోని సరికొత్త కలెక్షన్ ఆభరణాలు భారతీయ వారసత్వాన్ని , నైపుణ్యాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నాయి. ముఖ్యంగా పచ్చలు,  వజ్రాలు, కెంపులతో అద్దిన అత్యాధునిక, కళాత్మకంగా తయారుచేసిన ఎన్నో రకాల డిజైన్ కలెక్షన్స్ మీకు అందుబాటులోకి తెచ్చాము అంటూ వారు తెలిపారు. 

అంతేకాదు తమతో కలిసి పనిచేసిన సితార తాము ఇచ్చిన రెమ్యూనరేషన్ ను  చారిటబుల్ కి బహుమతిగా ఇచ్చి తన తండ్రిలాగే గొప్ప మనసు చాటుకుందని స్పష్టం చేశారు . ఏది ఏమైనా చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకుంది సితార అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link