Mahesh Babu Family Vacation: విదేశాల్లో ఫ్యామిలీతో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోన్న మహేష్ బాబు.. పిక్స్ వైరల్..
మహేష్ బాబు తన కూతురు సితార, కుమారుడు గౌతమ్ కృష్ణతో కలిసి యూరప్ టూర్‌లో ఎంజాయ్ చేస్తోన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇందులో మహేష్ బాబు తన లుక్ రివీల్ కాకుండా జాగ్రత్త పడ్డారు.
మరోవైపు మహేష్ బాబు కూతురు సితార, అన్నయ్య గౌతమ్ కృష్ణతో అల్లరి చేస్తోన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్‌లో ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తన ఫ్యామిలీతో కలిసి విదేశీ బాట పట్టారు. అక్కడ మంచు కొండల్లో ఎంజాయ్ చేస్తున్నారు.
మరోవైపు ఎక్కడ మహేష్ బాబు లుక్ రివీల్ కాకుండా.. కేవలం నమత్ర పిల్లలతో కలిసి ఉన్న ఫోటోలు మాత్రమే సోషల్ మీడయాలో పోస్ట్ చేశారు.
మహేష్ బాబు ఈ యేడాది గుంటూరు కారం మూవీతో ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అబౌ యావరేజ్‌గా నిలిచింది.
త్వరలో రాజమౌళితో చేయబోయే సినిమా కోసం రెడీ అవుతున్నారు. ఈ సినిమా ప్యాన్ వరల్డ్ నేపథ్యంలో తెరకెక్కనుంది.
ఈ సినిమా కోసం మహేష్ బాబు ప్రత్యేకంగా ట్రైనింగ్ అవుతున్నాడు. ఒకవైపు తను శిక్షణ తీసుకుంటూనే ఫ్యామిలీని వెకేషన్‌ను తీసుకెళ్లడం విశేషం. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.