Mahesh Babu: షాకింగ్ కు గురి చేస్తోన్న మహేష్ బాబు కొత్త లుక్.. సీఎం రేవంత్ తో సూపర్ స్టార్ పిక్స్ వైరల్..

Mon, 23 Sep 2024-12:46 pm,

తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి రూ. 50 లక్షల చెక్ ను తన భార్య నమ్రతతో కలిసి అందజేసారు.

 

జూబ్లీ హిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి కలిసి రూ.50 లక్షల చెక్ ను అందజేసారు. అటు AMB తరుపున మరో రూ. 10 లక్షల చెక్ ను అందజేసిన మహేష్ బాబు దంపతులు.

ఈ సందర్భంగా మహేష్ బాబు పెరిగిన జులపాల జుట్టు  గడ్డంతో కనిపించి అభిమానులను కనిపించి ఒకింత షాక్ కు గురిచేసాడు. ఈ లుక్ లో మహేష్ బాబు మరింత అందంగా కనిపిస్తున్నాడు. మొత్తంగా ప్రీ లుక్ తోనే మహేష్ బాబు కేక పుట్టిస్తున్నాడు.

రాజమౌళి సినిమా కోసమే మహేష్ బాబు కొత్త లుక్ కోసం పూర్తి మేకోవర్ అయ్యారు. అప్పట్లో ‘పోకిరి’, ‘అతిథి’ సినిమాల కోసం మేకోవర్ అయిన మహేష్ బాబు ఇపుడు రాజమౌళి సినిమా కోసం ఇప్పటి వరకు ఏ సినిమాలో కనిపించనటువంటి లుక్ లు కనిపించబోతున్నాడు.

మహేష్ బాబు, రాజమౌళి సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తూనే ఉంది. దసరా రోజు ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించనున్నట్టు సమాచారం. అంతేకాదు దీపావళి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టి 2026 సమ్మర్ లో రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link