Mahindra Xuv.E9 Price: వావ్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 450 కిమీ మైలేజీ.. మహీంద్రా కొత్త XUV.e9 కారు వచ్చేస్తోంది!
మహీంద్రా కంపెనీ ఈ XUV.e9 కారును ఏప్రిల్ 2025 నాటికి మార్కెట్‌లో లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది ఎంతో శక్తివంతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రానుంది. దీంతో పాటు పెద్ద బూట్ స్పేస్‌ను కలిగి ఉంటుంది.
ఇటీవలే ఈ XUV.e9 కారును పరీక్షిస్తున్న సమయంలో ఫోటోస్, వీడియోస్ లీక్ అయ్యాయి. ఈ లీక్ అయిన ఫోటోస్ చూస్తే ఇది ప్రీమియం సీటింగ్ లేఅవుట్‌తో రావడమే కాకుండా కార్గో స్పేస్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
మహీంద్రా కంపెనీ ఈ XUV.e9 కారును INGLO ప్లాట్‌ఫారమ్‌పై రూపొందించిన్నట్లు తెలుస్తోంది. అందుకే ఇందులో పెద్ద బూట్ స్పేస్‌తో పాటు రెండు వరస సీట్లు అందించారు. దీంతో ఈ కారులో మొత్తం 5 సీట్లు ఉంటాయి.
ఈ కారులో అనేక రకాల ప్రీమియం ఫీచర్స్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఇందులో రిక్లైనింగ్ ఫంక్షన్ ఫీచర్‌ను కూడా అందిస్తోంది. దీని ద్వారా బూట్ స్పేస్ మరింత పెరుగుతుంది.
ఇక XUV.e9 ఇంటీరియర్ వివరాల్లోకి వెళితే, ఈ కారు క్యాబిన్‌లోని సీట్లు లైట్ రంగులతో పాటు లెదర్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆటోమేటిక్ గేర్ లివర్‌ను కూడా అందిస్తున్నట్లు సమాచారం.
అలాగే ఈ కారులో 2-కప్ హోల్డర్లతో పాటు ఆటో-హోల్డ్ ఫంక్షన్‌ను కూడా అందిస్తోంది. అంతేకాకుండా ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే 2-స్పోక్ స్టీరింగ్ వీల్‌తో పాటు పెద్ద స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో ఈ XUV.e9 కారు అందుబాటులోకి రానుంది.
ఇక ఈ కారుకు సంబంధించిన మైలేజీ వివరాల్లోకి వెళితే, దాదాపు దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 435 నుంచి 450 కిమీల వరకు మైలేజీని అందిస్తుంది. ఇక ఇది ధర రూ.38 లక్షల ఎక్స్-షోరూమ్ ఉంటుంది.