Makar Sankranthi Rangoli Designs 2025: సంక్రాంతి పండక్కి చాలా సులభంగా వేయగలిగే రంగోలి డిజైన్స్ ఇవే..మీరూ ట్రై చేయండి

Wed, 08 Jan 2025-10:50 am,

 Makar Sankranthi Rangoli Designs 2025: సంక్రాంతి అంటే పిండి వంటలే కాదు..ముగ్గులు కూడా. అందుకే ముగ్గుల పోటీలు నిర్వహిస్తుంటారు. పోటీల్లో గెలిచిన వారికి మంచి మంచి బహుమతులు కూడా ఇస్తుంటారు. ఈ కాంపిటేషన్ లో చాలా మంది మహిళలు పాల్గొంటారు. అయితే ఈ పోటీలే కాదు..పండగ  సమయంలో ఇంటి ముందు రంగు రంగుల డిజైన్ ముగ్గులు కూడా వేస్తుంటారు. పక్కింటి వాళ్లు వేసిన ముగ్గుకు పోటీ మనం ముగ్గు ఉండాలంటూ రకరకాల కొత్త డిజైన్లను ప్రయత్నిస్తుంటారు.  

ఇక సంక్రాంతి పండగ రోజు ముగ్గులు వేసి వాటి మధ్యలో గొబ్బెమ్మలు పెట్టడం సంప్రదాయంగా వస్తోంది. అందుకే ముగ్గులు వేసి...వాటిలో పలు రకాల రంగులతో రంగవళ్లులుగా తీర్చిదిద్ది..వాటిపై గొబ్బెమ్మలు పేర్చి...రేగుపండ్లు, పూలతో అలంకరిస్తుంటారు. మరి ఈ సంక్రాంతి 2025కి ఎలాంటి ముగ్గులు మీరు కూడా వేయోచ్చు. సింపుల్ గా త్వరగా వేయగలిగే అందమైన ముగ్గులను ఇప్పుడు మనం చూద్దాం.   

నెమళ్ల ముగ్గు 

ఈ ముగ్గు వేయడం చాలా సులభం. ఇది సందు చుక్కల ముగ్గు. 13 చుక్కలు పెట్టి సందు చుక్కలు 7 వచ్చే వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ చిత్రంలో చూపించినట్లుగా రంగవల్లికలను తిప్పుతూ వేయాలి. చాలా ఈజీ   

సీతాకోక చిలకల ముగ్గు  ఈ ముగ్గు ఇంటి ముందు వేస్తే చాలా బాగుంటుంది. ఇది 21 చుక్కలు 3 వరుసలు సందు చుక్కలు 3 వచ్చే వరకు వేసుకోవాలి. ఇలా సీతాకోక చిలకలను వేసి రంగులతో అందంగా తీర్చిదిద్దవచ్చు.   

డిజైనర్ ముగ్గు  మీకు చుక్కల ముగ్గులపై ఇంట్రెస్ట్ లేనట్లయితే ఇలా డిజైన్ ముగ్గు వేసుకోవచ్చు. ఇందులో రంగులు నింపుకుంటే బాగుంటుంది.   

చుక్కల ముగ్గు  తిప్పుడు ముగ్గు అంటుంటారు చాలా మంది. ఈ ముగ్గు కొంచెం తికమక అనిపించినా వేసిన తర్వాత చాలా బాగుంటుంది.   

గులాబీ పువ్వుల ముగ్గు  గులబీ పువ్వులు మధ్యలో సంక్రాంతి పండగ శుభాకాంక్షలతో ఇలా డిజైన్ అలంకరించుకుంటే చాలా అందంగా ఉంటుంది.   

భోగి కుండల ముగ్గు 15 చుక్కలు సందు చుక్కలు 1 వచ్చే వరకు వేసుకోవాలి. ఈ భోగి కుండల మధ్యల  తామర పువ్వులు. చాలా బాగుంటుంది ఈ డిజైన్   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link