Makar Sankranti 2025: మకర సంక్రాంతి నుంచి ఈ రాశుల వారికీ మహర్ధశ.. ఎవరు ఎక్స్ పెక్ట్ చేయని డబ్బు మీ సొంతం..

Mon, 06 Jan 2025-7:10 am,

Makar Sankranti 2025: వేద జ్యోతిష్యంలో సూర్య మానం  సంక్రాంతి  ప్రతి యేడాది జనవరి 14న మకర సంక్రాంతి వస్తుంది. ఈ రోజున సూర్య భగవానుడు ధనుస్సు రాశి  నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రోజు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతోంది.  అంతేకాదు శుభకార్యాలైన ఉపనయనం, దేవతా ప్రతిష్ఠలకు ఇది అనువైన సమయంగా భావిస్తారు.

మకర సంక్రాంతి రోజున సూర్య భగవానుడు పుష్యమి నక్షత్రంలో సంచరిస్తాడు. మకర సంక్రాంతి వలన కొన్ని రాశుల వారికి యోగదాయకంగా ఉంటుంది.

మకర రాశి..

మకర సంక్రాంతి రోజున సూర్యుడు మకర రాశిలోకి సంచరించడంవలన మకరరాశి వారి జీవితం పూర్తిగా మారబోతుంది. గత కొన్ని రోజులుగా అనుభవిస్తున్న కష్టాలు పరారవుతాయి. అంతేకాదు సాధారణంగా అన్ని పనిలో విజయం సాధిస్తారు. ఆరోగ్యం పరంగా బాగుంటుంది. ఉద్యోగస్తులకు కార్యాలయంలో అధికారుల నుండి పూర్తి స్థాయి  మద్దతు లభిస్తుంది.

 

కుంభ రాశి.. మకర సంక్రమణం వలన కుంభ రాశి వారికి ఎంతో ప్రత్యేకమైనంది. ఈ కాలంలో మీ ఆర్ధిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. కొత్త ప్రాజెక్ట్ ల్లో అడుగుపెడితే మీదే విజయం. వ్యాపారంలో ఆర్ధికంగా గతంలో కంటే బలంగా ఉంటారు. మతపరమైన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు.

మేష రాశి.. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం వలన మేష రావి వారి జీవితంలో అనుకోని అభివృద్ది జరగబోతుంది. ఉద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆర్ధికంగా పుంజుకుంటారు. వ్యాపారంలో ఆర్ధికంగా నిలదొక్కుకుంటారు. గత కొన్నేళ్లుగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. అంతేకాదు మీ కుటుంబ సభ్యుల సహకారం లభిస్తోంది.

 

సింహ రాశి.. గ్రహ రాజు అయిన సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం వలన సింహ రాశి వారికి సమాజంలో గౌరవం పెరుగుతోంది. చేసే ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతాడు. వివాహా జీవితం బాగుంటుంది. వ్యాపారం చేసే ఈ రాశుల వారికీ ఆర్ధికంగా పుంజుకుంటారు. పెట్టుబడి నుంచి రాబడి పొందవచ్చు. డబ్బులు లోటుండదు. మానసికంగా మీ జీవితం ఆనందకరంగా ఉండబోతుంది.

తులా రాశి.. తులా రాశి వారికి మకర సంక్రమణం వలన ఎన్నో లాభాలు అందుకుంటారు. భూమికి సంబంధించిన విషయాల్లో మీదే పై చేయి. ఆర్ధికంగా బలోపేతం అవుతారు. కుటుంబంలో ఆనందం, శాంతి వెల్లివిరుస్తుంది. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు అందుకుంటారు.  కుటుంబంలో సహోదరుల సహాకారం వలన ఆర్ధికంగా ఇబ్బందుల నుండి బయట పడతారు. జీవితంలో రాజయోగం అనుభవిస్తారు.

గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటర్నెట్, జ్యోతిష్య పండితులు.. సాధారణ నమ్మకాలపై  ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించడం లేదు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link