Makar Sankranti 2025: సూర్యుడు శక్తివంతమైన ఎఫెక్ట్.. జనవరి 14 నుంచి ఈ రాశుల వారు అడుగు పెట్టిన చోట బంగారమే..
ఇదిలా ఉంటే సూర్యగ్రహం డిసెంబర్ 15వ తేదీన రాశి సంచారం చేసింది. అయితే మళ్లీ ఈ గ్రహం 2025 సంవత్సరం జనవరిలో 14వ తేదీన సంచారం చేయబోతోంది. ఈరోజు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటినుంచి మకర సంక్రాంతి ప్రారంభమవుతుందని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. అయితే ఈ మకర సంక్రాంతి సమయంలో కొన్ని రాశుల వారు విశేష లాభాలు పొందుతారు.
వచ్చే సంవత్సరం జనవరి 14వ తేదీన సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల వృశ్చిక రాశి వారికి అద్భుతమైన లాభాలు కలుగుతాయి. వీరు ఈ సమయంలో శుభవార్తలు వినడమే కాకుండా.. దాంపత్య జీవితం పరంగా విశేషమైన ప్రయోజనాలు పొందుతారు. అలాగే కుటుంబం పరంగా కూడా ఈ రాశి వారికి ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.
ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఈ మకర సంక్రాంతి సమయంలో ఆర్థికపరంగా చాలావరకు కలిసి వస్తుంది. వ్యాపారాల్లో స్థిరపడిన వ్యక్తులకు అద్భుతమైన ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఈ రాశి వారికి కొత్త ఆదాయ వనరులు కూడా లభిస్తాయి. ఇక ఉద్యోగాలపరంగా వీరికి ఎలాంటి డోకా ఉండదని జ్యోతిష్యులు చెబుతున్నారు.
సింహరాశి వారికి కూడా సూర్యుడి సంచారం ఎంతో శుభ సూచికంగా ఉంటుంది. ఈ రాశికి సూర్యుడు అధిపతిగా వ్యవహరిస్తాడు. సూర్యుడు వీరి జాతకంలో ఐదో స్థానంలో ఉండబోతున్నాడు.. దీనివల్ల మకర సంక్రాంతి సమయంలో ఈ రాశి వారికి ఎనలేని లాభాలు కలుగుతాయి. అలాగే వీరు శుభవార్తలు కూడా వింటారని జ్యోతిష్యులు చెబుతున్నారు.
గతంలో ఎప్పటినుంచో అనుభవిస్తున్న కోర్టు కేసులు కూడా ఈ సమయంలో పరిష్కారమవుతాయి. అలాగే డబ్బులు సంపాదించడంలో కొత్త ఆదాయ మార్గాలు కూడా పొందుతారు. ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది. ఈ సమయంలో అనారోగ్య సమస్యలు మొత్తం దూరం అవుతాయి.
మేషరాశి వారికి తొమ్మిదవ స్థానంలో సూర్యుడు సంచారం చేయబోతున్నాడు. దీనివల్ల అదృష్టం కూడా విపరీతంగా పెరుగుతుంది. అలాగే ఆదాయపరంగా వస్తున్న ఎలాంటి సమస్యలైనా పూర్తిగా తొలగిపోతాయి. దీనివల్ల వీరికి కొత్త ఆదాయ వనరులు ఏర్పడి సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది. ఇక ఉద్యోగాలు చేస్తున్నవారు ఈ సమయంలో ప్రశంసలు కూడా పొందుతారు.
మేష రాశి వారికి జనవరి 14వ తేదీ నుంచి ఎన్నో లాభాలు కలుగుతాయి. అలాగే మీకు ఇష్టమైన పనులు చేయడం వల్ల కూడా ఊహించని స్థాయిలో డబ్బు పొందుతారు. ఇక స్నేహితుల సహకారంతో కొన్ని సమస్యల నుంచి కూడా పరిష్కారం పొందుతారు. అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి కాస్త ఉపశమనం కూడా కలుగుతుంది.