Electric car: మెర్సిడెస్ ఫీచర్లు..తీస్లా లుక్..అద్దిరిపోతున్న ఇండియన్ మేడ్ కారు
కంపెనీ ఈ కారు బ్యాటరీ ప్యాక్ ను ఫాస్ట్ ఛార్జింగ్ పరిజ్ఞానంతో కూడా కూడి ఉంది. కేవలం 30 నిమిషాల్లో 0 నుంచి 80 శాతం ఛార్జింగ్ అవుతుంది.
ఈ కారులో 96 kwh బ్యాటరీ ప్యాక్ ఉపయోగించారు. ఇది 150 kwh శక్తిని ఇవ్వగల సామర్ధ్యం కలిగి ఉంది. ఈ శక్తితో ఈ కారు 100 kmph వేగాన్ని కేవలం 5.4 సెకన్లలో అందుకుంటుంది.
ఈ కారు పూర్తిగా ఇండియాలోనే నిర్మితమైంది. 90 శాతం స్పేర్ పార్ట్స్ కూడా ఇండియావే. సబ్ స్క్రిప్షన్ సర్వీస్, లీజ్ ఆఫర్ తో కంపెనీ ఈ కారు ప్రవేశపెడుతోంది.
ప్రస్తుతం ఈ కారు భారతీయ రోడ్లపై టెస్టింగ్ లో ఉంది. 2021లో లాంచ్ చేస్తారని తెలుస్తోంది. ఈ కారు ధర కూడా చాలా తక్కువ ఉండవచ్చనే అంచనా ఉంది.