Makeup Removal Tips: మేకప్ తొలగించేటప్పుడు ఏ పొరపాట్లు చేయకూడదో తెలుసా
మేకప్ తొలగించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే పింపుల్స్, డ్రైనెస్, ముడతలు ఏర్పడవచ్చు. మేకప్ తొలగించాక ముఖం డ్రైగా ఉండకూడదు.
మేకప్ తొలగించాక ముఖాన్ని నీళ్లతో ఫేస్‌వాష్ చేసుకోవాలి. వేడి నీళ్లు అస్సలు ఉపయోగించకూడదు. గోరు వెచ్చని నీళ్లు లేదా చల్లని నీళ్లే వినియోగించాలి. ఆ తరువాత ముఖానికి టోనర్, సీరమ్ వంటిది అప్లై చేయాలి.
కాటన్ ప్యాడ్ సహాయంతో పెదాలుపై మలినాలు తొలగించాలి. మేకప్ తొలగించాక కాటన్‌తో శుభ్రం చేసుకోవాలి. చివరిగా మాయిశ్చరైజర్ రాసుకోవాలి. చేతులతో నెమ్మదిగా మస్సాజ్ చేసుకోవాలి. చెవులు, మెడ అన్ని భాగాలు శుభ్రం చేసుకోవడం మర్చిపోకూడదు.
మేకప్ తీసిన తరువాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. లేకపోతే బ్యాక్టిరియా, కీటకాలు చర్మంపై దాడి చేస్తాయి. ముఖం శుభ్రం చేసేటప్పుడు తల కేశాలు తగలకుండా జాగ్రత్త వహించాలి. కనీసం 10 నిమిషాలు శుభ్రం చేసుకోవాలి. అప్పుడే ముఖం లోపల్నించి శుభ్రమౌతుంది.
మేకప్ అనేది దాదాపు ప్రతి అమ్మాయికి చాలా ఇష్టం. మేకప్ వేసుకోవడం, తీయడం రెండూ చాలా ముఖ్యమైనవే. మేకప్ తొలగించేటప్పుడు కొన్ని విషయాల్ని పరిగణలో తీసుకోకుంటే..చర్మం ఘోరంగా దెబ్బతింటుందని బ్యుటీషియన్లు చెబుతున్నారు. మేకప్ ఎప్పుడు చేతులతో రాయకూడదు. తొలగించాక నీళ్లు శుభ్రం చేసుకోవాలి.