Malavika Mohanan: అబ్బో.. ఈ హీరోయిన్ మాములది కాదు.. ఏకంగా ప్రభాస్ పాన్ ఇండియా సినిమానే రిజెక్ట్ చేసిందిగా
Malavika Mohanan: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్...రాజా సాబ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. మరో వైపు హనురాఘవపూడి డైరెక్షన్ లో మరో పాన్ ఇండియా సినిమా త్వరలోనే తెరకెక్కుతోంది. అయితే ప్రభాస్ సినిమాలో నటించే అవకాశం వస్తే ఏ హీరోయిన్ కూడా రిజక్ట్ చేయురు. కానీ ఓ బోల్డ్ హీరోయిన్ మాత్రం ప్రభాస్ సినిమాను రిజక్ట్ చేసిందట.
ఈ వార్త నిజంగా ప్రభాస్ ఫ్యాక్స్ షాకింగే అని చెప్పవచ్చు. ప్రభాస్ సినిమానే రిజక్ట్ చేసిన హీరోయిర్ ఎవరో కాదు క్రేజీ బ్యూటీ మాళవిక మోహన్.
అందచందాలతో మాళవిక మోహన్ సోషల్ మీడియాలో ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే.
అమె చేస్తోన్న ఫొటో షూట్స్ క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. బోల్డ్ గా గ్లామర్ ప్రదర్శిస్తూ మాళవిక యువతను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం మాళవిక, ప్రభాస్ సరసన రాజాసాబ్ సినిమాలో నటిస్తోంది. మరి ఆమె రిజెక్ట్ చేసిన సినిమా ఏదని ఆలోచిస్తున్నారా
ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్ లో సలార్ చిత్రం వచ్చింది. ఈ మూవీ మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రుతి హాసన్ నటించింది. అయితే ప్రశాంత్ నీట్ ముందుగా ఈ ఛాన్స్ మాళవిక మోహన్ కు ఇచ్చారట
ఓఇంటర్వూలో ఆమె మాట్లాడుతూ బాహుబలి, బహుబలి 2కి పెద్ద ఫ్యాన్. ఆ సినిమాలు చూసిన తర్వాత ఒక్కసారి అయినా ప్రభాస్తో కలిసి నటించాలనుకున్నా.
కొన్నేళ్ళ తర్వాత ప్రశాంత్ నీల్ నాకు సలార్ సినిమాలో చాన్స్ ఇచ్చారు. ఈ అవకాశం కొన్ని కారణాల వల్ల రిజక్ట్ చేయాల్సి వచ్చింది. ఫైనల్ గా ప్రభాస్ తో కలిసి రాజాసాబ్ సినిమాతో నటిస్తుంది. ఇది కూడా క్రేజీ మూవీ. హర్రర్, కామెడీ, రొమాంటిక్ కలగలిపి ఉంటుందని మాళవిక తెలిపింది.