Malavika Mohanan Pics: మాళవిక మోహనన్ హాట్ ట్రీట్.. మలయాళ బ్యూటీ గ్లామర్ మాములుగా లేదుగా!
మాళవిక మోహన్ నిత్యం సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. తరచుగా హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ.. కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తారు. మాళవిక తాజాగా వైట్ డ్రెస్సులో తళుక్కుమన్నారు.
మాళవిక మోహనన్ ప్రస్తుతం తమిళ, మలయాళీ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇక తెలుగులో కూడా త్వరలోనే నటించే అవకాశం ఉందని సమాచారం.
ఇళయదళపతి విజయ్ హీరోగా వచ్చిన 'మాస్టర్' సినిమాతో మాళవిక బాగా పాపులర్ అయ్యారు. ఆ సినిమాలో మలయాళ బ్యూటీ తన అందచందాలతో అందరినీ ఆకట్టుకున్నారు.
2013లో 'పెట్టం పోలె' మలయాళీ చిత్రంతో మాళవిక మోహనన్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. సూపర్ స్టార్ రజనీకాంత్ 'పేట' సినిమాతో ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ముంబై విల్సన్ కాలేజీలో మాస్ మీడియా పూర్తి చేసిన మాళవిక మోహనన్.. ఆ తరువాత తన తండ్రితో పాటు సినిమాటోగ్రఫీ చేశారు. ఆపై హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.
1993 ఆగష్టు 4న కేరళలో మాళవిక మోహనన్ జన్మించారు. మలయాళ, హిందీ సినిమాలలో సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన మోహనన్ కుమార్తె ఈ మాళవిక. మోహనన్ కుటుంబం కేరళకు చెందినదే అయినా ముంబైలో సెటిల్ అయ్యారు.