Malavika Mohanan: ముగ్ద మ‌నోహ‌రంగా మాళవిక మోహనన్ అందాల‌ విందు.. లేటెస్ట్ పిక్స్ వైర‌ల్..

Tue, 02 Apr 2024-2:56 pm,

మాళవిక మోహనన్ త‌మిళ స్టార్ విజయ్ హీరోగా నటించిన 'మాస్టర్' సినిమాతో  మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతకు ముందు రెండు మూడు మలయాళ‌ల చిత్రాల్లో నటించినా రాని గుర్తింపు 'మాస్టర్' మూవీతో వచ్చింది.

2013లో మలయాళ మూవీ 'పట్టామ్ పోలే' మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నిర్ణాయకం సినిమాలో తన న‌ట‌న‌తో  మెప్పించింది మాళవిక మోహనన్.

అటు శాండిల్ వుడ్ సినీ ఇండస్ట్రీలో కూడా తన అదృష్టం పరీక్షించుకుంది. ఆపై 'బియాండ్ ది క్లౌడ్స్' మూవీలో నటించింది. ఈ మూవీలో ఇషాన్ ఖట్టర్ హీరోగా నటించాడు.

'ది గ్రేట్ ఫాదర్' అనే మలయాళ మూవీ తర్వాత  రజినీకాంత్ హీరోగా నటించిన 'పేట' మూవీతో తమిళంలో ఎంట్రీ ఇచ్చింది.  ఈ సినిమాతో ఈమెకు మాస్‌లో మంచి ఫాలోయింగ్ ఏర్ప‌డింది. 

ఇప్పటి వరకు ద‌క్షిణాది సినీ ఇండస్ట్రీలో కన్నడ, మలయాళం, తమిళంతో పాటు హిందీలో నటించిన ఈ భామ త్వరలో ప్రభాస్ టైటిల్ రోల్లో యాక్ట్ చేస్తోన్న 'ది రాజా సాబ్' మూవీతో టాలీవుడ్‌లో డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వనుంది.

మరి ప్రభాస్, మారుతిల 'ది రాజా సాబ్' మూవీపై మాళవిక మోహనన్ భారీ ఆశలే పెట్టుకుంది. మరి ఈ మూవీ మాళవిక మోహనన్ కెరీర్‌ను బుల్లెట్‌లా  టాలీవుడ్‌లో దూసుకుపోతుందా లేదా అనేది చూడాలి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link