Malavika Mohanan: సినీ ఇండస్ట్రీలో బుల్లెట్‌లా దూసుకుపోతున్న మాళవిక మోహనన్.. చేతినిండా ఆఫర్స్‌తో ఫుల్ బిజీ..
మాళవిక మోహనన్ విజయ్ హీరోగా నటించిన 'మాస్టర్' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయింది.
2013లో మలయాళ మూవీ 'పట్టామ్ పోలే' మూవీతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత నిర్ణాయకమ్ మూవీలో నటించింది. అటు కన్నడ, హిందీలో నటించిన ఈ భామకు రజినీకాంత్ 'పేట' మూవీ మంచి గుర్తింపు ఇచ్చింది.
ఇప్పటి వరకు సౌత్ సినీ ఇండస్ట్రీలో కన్నడ, మలయాళం, తమిళంతో పాటు హిందీలో నటించిన ఈ భామ త్వరలో 'ది రాజా సాబ్' మూవీతో తెలుగులో డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వనుంది.
మరి ప్రభాస్, మారుతిల 'ది రాజా సాబ్' మూవీపై మాళవిక మోహనన్ భారీ ఆశలే పెట్టుకుంది. మరి ఈ సినిమాతో మాళవిక తెలుగులో టాప్ స్టార్‌గా ఎదుగుతుందా లేదా అనేది చూడాలి.