Malvi Malhotra: అసలు మాల్వీ మల్హోత్ర ఎవరు.. ? ఈమె బ్యాక్ గ్రౌండ్ గురించి తెలుసా..

Tue, 09 Jul 2024-8:18 am,

మాల్వీ మల్హోత్ర.. తెలుగులో రాజ్ తరుణ్ తో  చేస్తోన్న ‘తిరగబడరా సామి’మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా విడుదల కాకముందు ఒక్కసారిగా రాజ్ తరుణ్ ఇష్యూతో ఒక్కసారిగా పాపులర్ అయింది.

మాల్వీ మల్హోత్రతో రాజ్ తరుణ్ డేటింగ్ చేస్తున్నాడు కాబట్టి .. తనను పట్టించుకోకుండా  మోసం చేసాడని అందుకు కారణం మాల్వీ మల్హోత్రనే అనే ఆరోపణలతో వార్తల్లో వ్యక్తిగా నిలిచింది.

హిమాచల్ ప్రదేశ్ కు చెందిన మాల్వీ మల్హోత్ర హిందీలో తెరకెక్కిన టీవీ సీరియల్ ‘ఉడాన్’ సీరియల్ తో 2017లో  నటిగా పరిచయమైంది. ఆ తర్వాత 2018లో ‘హోటల్ మిలన్’ మూవీతో హిందీ తెరకు పరిచయం అయింది.

ఆ తర్వాత ఒక షార్ట్ ఫిల్మ్, ఓటీటీ వేదికగా ‘జొరావర్ ది జాక్వెలిన్’ అనే ఓటీటీ మూవీలో నటించింది. 2023లో ‘అభ్యుదయం’ అనే మలయాళ మూవీలో నటించింది.

ఇటు తెలుగులో రాజ్ తరుణ్ హీరోగా ‘తిరగబడరా సామి’ మూవీతో తెలుగు తెరకు పరిచయం అవుతోంది. ఈ సినిమా విడుదల కాకముందే రాజ్ తరుణ్ తో డేటింగ్ చేస్తోందన్న కారణంగా వార్తల్లో నిలిచింది.

అంతేకాదు మాల్వీ వాళ్ల ఫ్యామిలీకి హిమాచల్ ప్రదేశ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో మంచి సంబంధాలే ఉన్నాయి.

 

అలా అక్కడ అధికారంలో  ఉన్న పార్టీ వాళ్లతో తనను బెదిరించినట్టు లావణ్య పేర్కింది. ఈమె సినిమాల్లో నటిస్తూనే కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్ లో నటించింది.  

 

మొత్తంగా తెలుగులో నటించిన తొలి సినిమా విడుదల కాకముందే.. ఇపుడు కాంట్రవర్సీ ఇష్యూతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది మాల్వీ మల్హోత్ర. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link