Ariana Viviana Birthday : మంచు విష్ణు కూతుళ్ల బర్త్ డే.. అరియానా, వివియానా పిక్స్ వైరల్

మంచు విష్ణుకి కవల కూతుళ్లు ఉన్నారన్న సంగతి తెలిసిందే. మొత్తంగా విష్ణుకి నలుగురు పిల్లలున్నారు. అందులో అరియానా, వివియానా కవల పిల్లలు.

అరియానా వివియానా బర్త్ డే (డిసెంబర్ 2)ను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసినట్టు కనిపిస్తోంది. మంచు విష్ణు కూతుళ్ల బర్త్ డేకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి
ఇక మంచు విష్ణు అయితే తన కూతుళ్లకు విషెస్ చెబుతూ.. మై లిటిల్ మమ్మీస్ అంటూ ఎంతగా ప్రేమిస్తున్నాడో చెబుతూ విషెస్ చెప్పేశాడు.
బాబాయ్ మంచు మనోజ్ విషెస్ చెబుతూ.. ఈ మను బాబాయ్ మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాడు.. హ్యాపీ బర్త్ డే డియార్ అరియానా, వివియానా అని అనేశాడు.
ఇక అత్త మంచు లక్ష్మీ విషెస్ చెబుతూ.. వీళ్లిద్దరికీ అప్పుడే పదకొండేళ్లు వచ్చాయంటే నమ్మలేకున్నా.. హ్యాపీ బర్త్ డే.. నెక్స్ట్ నుంచైనా మంచి ఫోటోలు నాతో దిగండి అని చెప్పుకొచ్చింది.