Mangala Gochar 2024: అంగారకుడు తనస్వంత రాశిలోకి.. 10 రోజుల్లో ఈ రాశులకు బంపర్ లాటరీ..!
Mangala Gochar 2024: మంగళగోచారం ఈ రాశుల వారికి జూన్ 1 తర్వాత చాలా శుభప్రదంగా ఉంటుంది. దీంతో వీళ్లు ఏ పని చేసినా నక్క తోక తొక్కినట్లే అవుతుందట. మేషరాశిలో కుజుడు ప్రవేశం ఏ రాశులకు బంపర్ లాటరీ తగులుతుందో తెలుసుకుందాం
మేషం రాశి.. అంగారక రాశి మార్పు మేష రాశికి బాగా కలిగి వస్తుంది. ఈ రాశిలోకి అంగారకుడు ప్రవేశించనున్నాడు కాబట్టి ముఖ్యంగా వీరు పని ప్రదేశంలో మంచి ప్రశంసలు పొందుతారు. ఈ సమయంలో వీరి ఆదాయం కూడా పెరగుతుంది. మరో పదిరోజుల్లో వీరికి అన్ని కలిసి వస్తాయి. ఏ పని ప్రారంభించిన విజయం తథ్యం. ముఖ్యంగా వ్యాపారులకు ఇది లాభాలను తెచ్చిపెట్టే సమయం. ఎక్కడకు వెళ్లినా గౌరవ మర్యాదలు లభిస్తాయి.
మిథునం.. మిథున రాశివారికి కూడా మరో పదిరోజుల్లో బంపర్ లాటరీ తగిలినట్లవుతుంఇ. ఎందుకంటే ఈ సమయంలో వీరు కోరకుకున్న ఉద్యోగం, ప్రమోషన్లు పొందుతారు. ముఖ్యంగా ఏవైనా స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో సఖ్యత ఏర్పడుతుంది. ఎక్కడికైనా బయటకు ప్రయాణాలు చేస్తారు. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది.
సింహం.. సింహ రాశివారు చదువుతున్న విద్యార్థులకు ఈసమయం అత్యంత అనుకూలమైనటువంటిది. సింహ రాశివారికి అనుకోని లాభాలు వచ్చిపడతాయి. అందుకే ఈ సమయంలో వీరు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడం, వ్యాపారాలు మొదలు పెట్టడం వంటివి చేసిన ఆర్థిక లాభాలు గడిస్తారు. ఆరోగ్యపరంగా కూడా అంతా బాగుంటుంది. భాగస్వామితో సమయం గడుపుతారు, ఇది మీ వైవాహిక జీవితాన్ని సంతోషపరుస్తుంది.
కన్య.. కన్య రాశివారు ఈ సమయంలో ఆద్యాత్మిక ప్రయాణాలు చేస్తారు. మరో పది రోజుల్లో వీరికి కూడా సుడి తిరగనుంది. కన్య రాశికి కూడా ఈ అంగారకుడి మార్పు అత్యంత ప్రయోజనాన్ని అందించే సమయం. ఈ రాశివారికి ఈ సమయంలో కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. ఆర్థిక ప్రయోజనాలు కూడా మెండుగా ఉంటాయి. (Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)