Maoists Attack: ములుగు జిల్లాలో మావోయిస్టుల దుశ్చర్య.. ఇన్‌ఫార్మర్ల నెపంతో ఇద్దరి గ్రామస్థుల దారుణ హత్య...

Fri, 22 Nov 2024-9:18 am,

తెలంగాణ ములుగు జిల్లాలో దారుణ ఘటన నిన్న అర్ధరాత్రి చోటు చేసుకుంది. వాజేడు మండలం పెనుగోలు కాలనీకి చెందిన ఇద్దరు వ్యక్తులను దారుణంగా హత్య చేశారు.  

పెనుగోలు కాలనీ పంచాయితీ కార్యదర్శిగా పనిచేస్తున్న ఉయిక రమేష్‌, అర్జున్‌ అనే ఇద్దరిని అర్ధరాత్రి అత్యంత దారుణంగా మావోలు హత్య చేశారు.  

హత్య చేసిన తర్వాత వారి మృతదేహాల వద్ద లేఖ వదిలి వెళ్లారు మావోయిస్టులు. పలుమార్లు హెచ్చరించినా తీరు మారకపోవడంతో హతమార్చినట్లు మావోలు రాసిపెట్టారు.  

ఈ మావోయిస్టుల దుశ్చర్యతో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు ప్రాంతాలను కూడా అలెర్ట్‌ అయ్యారు పోలీసులు. ఈ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై కూడా ఆరా తీస్తున్నారు పోలీసులు.  

ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇన్‌ఫార్మర్ల నెపంతో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ పని ఎవరు చేశారా? అని పోలీసులు విచారణ మొదలు పెట్టారు. గతంలో మావోయిస్టులతో పనిచేసిన వారిపై కూడా నిఘా పెంచారు.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link