Maruti Suzuki Cars Discounts: మారుతి సుజుకి కార్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్.. పండగకి కొత్త కారు కొనేస్తే పోలా
ఆగస్టు నెలలో అద్దిరిపోయే సేల్స్ ట్రాక్ రికార్డు సొంతం చేసుకున్న మారుతి సుజుకి కార్లు ఈ నెలలో మరిన్ని డిస్కౌంట్ ఆఫర్స్ మోసుకొచ్చింది. ఫెస్డివల్ సీజన్‌ని మరింత సంబరాల్లో ముంచెత్తేందుకు మారుతి సుజుకి రెడీ అయింది. మరి ఇంకెందుకు ఆలస్యం.. చెకౌట్ దీజ్ ఆఫర్స్
Maruti Suzuki Celerio Discounts: మారుతి సుజుకి సెలెరియో కారుపై మొత్తం రూ. 64,000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఈ మొత్తం డిస్కౌంట్ లో రూ. 40 వేలు క్యాష్ బెనిఫిట్స్ కాగా ఎక్స్‌చేంజ్ బోనస్ కింద రూ. 20 వేల వరకు లభిస్తోంది. కార్పొరేట్ బోనస్ కింద మరో 4 వేల రూపాయల వరకు లభిస్తోంది.
Maruti Suzuki Eeco Discounts: మారుతి సుజుకి ఈకో కారుపై మొత్తం రూ. 29 వేల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. అందులో రూ. 15 వేలు డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్స్ కాగా మరో 10 వేల వరకు ఎక్స్‌చేంజ్ బోనస్ కింద లభిస్తున్నాయి. ఇదే కాకుండా కార్పొరేట్ బోనస్ కింద రూ. 4 వేలు కలిపి మొత్తం రూ. 29 వేలు డిస్కౌంట్ అందుబాటులో ఉంది.
Maruti Suzuki Swift Discounts: మారుతి సుజుకి స్విఫ్ట్ కారుపై మొత్తం రూ. 60 వేల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఇందులో రూ. 35 వేలు క్యాష్ డిస్కౌంట్ ఆఫర్ కాగా ఎక్స్‌చేంజ్ బోనస్ కింద మరో రూ. 20 వేల వరకు ఆఫర్ చేస్తోంది. కార్పొరేట్ బోనస్ కింద రూ. 5 వేలు లభిస్తున్నాయి.
Maruti Suzuki S-Presso Discounts: మారుతి సుజుకి S-ప్రెస్సో కారుపై మొత్తం రూ. 59 వేల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. అందులో రూ. 35 వేలు డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్స్ కాగా ఎక్స్‌చేంజ్ బోనస్ కింద రూ. 20 వేల వరకు, కార్పొరేట్ బోనస్ కింద రూ. 4 వేలు లభిస్తాయి.
Maruti Suzuki WagonR Discounts: మారుతి సుజుకి వ్యాగాన్ ఆర్ కారుపై మొత్తం రూ. 59 వేల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. అందులో ఎక్స్‌చేంజ్ బోనస్ కింద రూ. 20 వేల వరకు తగ్గింపు లభిస్తుండగా.. రూ. 35 వేలు డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్స్ ఆఫర్ ఉంది. మరో రూ. 4 వేలు కార్పొరేట్ బోనస్ కింద డిస్కౌంట్ లభిస్తోంది. మొత్తం రూ. 59 వేలు డిస్కౌంట్ లభిస్తోంది.
Maruti Suzuki Alto K10 Discounts: మారుతి సుజుకి ఆల్టో K10 కారుపై మొత్తం రూ. 54000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. అందులో రూ. 35 వేలు డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్ కాగా ఎక్స్‌చేంజ్ బోనస్ కింద రూ. 15 వేలు, కార్పొరేట్ బోనస్ కింద రూ. 4 వేలు లభిస్తాయి.
Maruti Suzuki Dzire Discounts: మారుతి సుజుకి డిజైర్ కారుపై కేవలం ఎక్స్‌చేంజ్ బోనస్ కింద రూ. 10 వేలు డిస్కౌంట్ మాత్రమే లభిస్తోంది. అంతకు మించి డిజైర్ మోడల్‌పై మరే ఇతర డిస్కౌంట్స్ లేవు.