Mauni Amavasya 2025: మౌని అమావాస్య రోజు.. శక్తివంతమైన 2 యోగాలు.. ఈ రాశులవారికి అపరమైన డబ్బు..

ఈ మౌని అమావాస్య రోజు మకరరాశిలో సూర్యుడితో పాటు చంద్ర, బుధ గ్రహాలు కలయిక జరపబోతున్నాయి. ఇది జనవరి 29న జరగబోతోంది. అయితే ఈ సమయంలో త్రివేణి యోగం ఏర్పడబోతోంది. ఈ రోజు మీనరాశిలో శుక్రుడు ఉండటం వల్ల ఎంతో శక్తివంతమైన మాళవ్య రాజ్యయోగం కూడా ఏర్పడబోతోంది..

మౌని అమావాస్య రోజు ఏర్పడే కొన్ని ప్రత్యేకమైన యోగాల కారణంగా కొన్ని రాశులవారికి చాలా మేలు జరగబోతోంది. ఈ సమయంలో వ్యాపారాలు చేసేవారికి ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆనందంగా కూడా రెట్టింపు అవుతుంది. అలాగే దీర్ఘకాల సమస్యలు కూడా పరిష్కారమవుతాయి.

మౌని అమావాస్య రోజున ఏర్పడే ప్రత్యేకమైన యోగాల కారణంగా మకర రాశివారికి ఎంతో మేలు జరుగుతుంది. అంతేకాకుండా ఈ సమయంలో వివాహితులు శుభవార్త వినే ఛాన్స్ కూడా ఉంది. అంతేకాకుండా ఆర్థికంగా కూడా పురోగతి పొందుతారు. అలాగే ఎలాంటి పనులు చేసిన అధికారుల నుంచి మంచి సపోర్ట్ పొందుతారు.
మౌని అమావాస్య త్రివేణి యోగం, మాళవ్య రాజ్యయోగాలు ఏర్పడబోతున్నాయి. దీని కారణంగా కన్యా రాశి వారికి ఎంతో మేలు జరుగుతుంది. అంతేకాకుండా ఆర్థిక లాభాలు పొందుతారు. అలాగే వ్యాపారాలు చేసేవారికి అదృష్టం కూడా కలిసి వస్తుంది. పూర్వీకుల ఆస్తులు పొందుతారు.
మౌని అమావాస్య వల్ల ఏర్పడే శక్తివంతమైన యోగాలు వృషభ రాశివారికి విపరీతమైన ప్రయోజనాలను అందించనున్నాయి. వీరికి ఒత్తిడి నుంచి పరిష్కారం లభించి.. ఆనందకరమైన జీవితం కూడా పొందుతారు. అలాగే ఆకస్మిక ధన లాభాలు పొందగలుగుతారు.
మౌని అమావాస్య నుంచి తుల రాశి వారి జీవితం పూర్తిగా మారబోతోంది. ఉద్యోగాలు చేసేవారికి సహోద్యోగుల సపోర్ట్ లభించి మంచి లాభాలు పొందుతారు. అలాగే వీరికి సంతోషం, ఐశ్వర్యం కూడా రెట్టింపు అవుతుంది. వీరికి అద్భుతమైన లాభాలు కలుగుతాయి.